3 Are Dead in Shooting at a Colorado Walmart అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Three killed at walmart in thornton as customers flee in panic

WalMart, Colorado, shooting, colorado shooting, WalMart shooting, denver shooting, Guns in the USA, US, World News

Two men and a woman were killed in a shooting inside a suburban Denver Walmart on Wednesday night that forced customers to either hide or flee.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Posted: 11/02/2017 11:07 AM IST
Three killed at walmart in thornton as customers flee in panic

న్యూయార్క్ నగరంలో ఉగ్రవాదులు అద్దె ట్రక్కుతో సృష్టించిన మారణకాంఢ విషాధాఛాయలు, ఘటన తాలుకు గుర్తులు కూడా ఇంకా చెరిగిపోకముందే.. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం మరో బీభత్సకాండకు మూగసాక్షిగా నిలిచింది. కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ వ్యక్తి తుపాకితో కస్టమర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరుగుతందని అధికారులు తెలిపారు.

భారత కాల మానం ప్రకారం ఇవాళ ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్‌టన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. సబర్బన్‌ డెన్వర్ లోని వాల్ మార్ట్ షాపింగ్ మాల్ లో తుపాకీ మోత మోగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.

మాల్ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలీటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిగాయని.. మాల్‌లో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేశారని మార్ట్ ఉద్యోగి ఒకరు తెలిపారు. స్థానిక ఛానెళ్లు మాత్రం 30 రౌండ్ల దాకా కాల్పులు జరిగాయని, 9 మంది గాయపడ్డారని చెప్పటం గమనార్హం.

ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారని అధికారులు దృవీకరించారు. ఇద్దరు పురుషులు ఘటనాస్థలంలోనే చనిపోగా, మరో మహిళ మాత్రం అస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించిందని తెలిపారు. ఈ ఘటనను ఉగ్రదాడి కోణం లేదని చెప్పలేమని అంటూనే.. ఉగ్రదాడి నేపథ్యంలో కాల్పులు జరిగినట్టు కూడా అధారాలు లేవని అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు తెలియాజేయాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WalMart  Colorado  shooting  colorado shooting  WalMart shooting  denver shooting  Guns in the USA  US  World News  

Other Articles