LPG cylinder to cost Rs 93 more now మళ్లీ పేలిన వంటింటి బాంబ్.. దర పెంపు

Lpg prices hiked by rs 93 in delhi atf prices raised by 2

domestic LPG cylinder, LPG price, Delhi, aviation turbine fuel, ATF prices, ,India ,Delhi ,energy and resource ,natural gas

The price of a domestic LPG cylinder in Delhi was hiked by Rs 93 per cylinder. After the hike, a 14 kg domestic LPG cylinder will cost Rs 742 per cylinder in Delhi.

మళ్లీ పేలిన వంటింటి బాంబ్.. దర పెంపు

Posted: 11/02/2017 09:55 AM IST
Lpg prices hiked by rs 93 in delhi atf prices raised by 2

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్.. (ఎల్పీజీ) సిలిండర్.. అదేనండి వంటింటి బాంబును కేంద్రం మళ్లీ పేల్చింది. సబ్బీడి, సబ్సీడీయేతర సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.93 పెంచగా రూ.742కు చేరింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాయితీలను తొలగించేందుకు ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత ఏడాది కేంద్రం నిర్ణయించింది.

ఇలా ధరలు పెంచడం ఇది 19వ సారి. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.419.18గా ఉంది. అంటే ఇప్పటికి రూ.76.51 పెరిగింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా 12 సిలిండర్లు సబ్సిడీపై ఇస్తున్నారు. ఆపై అవసరమైతే మార్కెట్‌ ధరకు కొనుక్కోవలసిందే. నాన్‌-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర గత అక్టోబరులో రూ.50 పెంచారు. దాంతో రూ.649కి చేరింది. తాజా పెంపుతో రూ.742 అయింది. జెట్‌ ఇంధనం (ఏటీఎఫ్‌) ధర కూడా 2 శాతం పెరిగింది. కిలో లీటరుకు రూ.1,098 పెంచగా.. ప్రస్తుతం ఢిల్లీలో దాని ధర కిలో లీటరుకు రూ.54,143కు చేరింది. ఇంతకుముందు రూ.53,045 ఉండేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles