Transformer blast kills 14, injures More in Jaipur | జైపూర్ లో దారుణ ప్రమాదం.. ట్రాన్స్ ఫార్మర్ పేలి 14 మంది మృతి

14 killed in transformer blast in rajasthan

Rajasthan Transformer Blast, Transformer Blast jaipur, Transformer Blast Incident, Transformer Blast India, Transformer Blast Kills 14, Transformer Blast Shahpura

Rajasthan Transformer Blast Mishap. Transformer exploded in the Khatulai village near the Shahpura town in Rajasthan killing 14 persons and injuring several others, police said. The massive explosion occurred at a time when the members of a family were passing through the transformer on their way to perform some marriage rituals, they said.

జైపూర్ లో ఘోరం.. ట్రాన్స్ ఫార్మర్ పేలి 14 మంది మృతి

Posted: 11/01/2017 10:16 AM IST
14 killed in transformer blast in rajasthan

రాజస్థాన్ లో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ పేలి 14 మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం షాపూర్ జిల్లా ఖట్లోయి గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తొలుత ట్రాన్స్ ఫార్మర్ పేలి ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఆపై విద్యుత్ ను పునరుద్ధరించే క్రమంలో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో హై వోల్టేజ్ వైర్ పడిపోయిందని.. విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేయకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో ఓ గర్భిణి కూడా ఉండటంతో ఆమెను, కడుపులోకి బిడ్డను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించగా, శిశువు మరణించినట్లు తెలిపారు

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వసుంధర రాజే తన కార్యక్రమాలను రద్దు చేసుకుని క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఎస్ ఎం ఎస్ ఆస్పత్రికి బయలుదేరారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తూ, మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఆమె ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles