AP Intelligence eyes on Revanth Reddy meet రేవంత్ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా

Ap intelligence eyes on revanth reddy meet

Revanth Reddy, TTDP leaders, chandrababu, KCR, Telangana, AP Intelligence, jubilee hills house, hyderabad.

AP Intelligence eyes on Former TDP Telangana working president, A Revanth Reddy's house to draw the details of the leaders who are quiting Telangana TDP.

వెంట వెళ్లేదేవరు..? రేవంత్ ఇంటిపై ఏపీ ఇంటెలిజెన్స్ నిఘా

Posted: 10/30/2017 12:01 PM IST
Ap intelligence eyes on revanth reddy meet

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ నేత.. రేవంత్ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఆయన వెంట ఎవరెవరు నడుస్తున్నరన్న విషయమై ఏర్పడిన సంధిగ్థత దాదాపు క్లారిటీకి వచ్చేసింది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ ముఖ్య నేతల్లో వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం.

వీరితో పాటుగా ఎంపిటీసీలు, సర్పంచ్ లు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులతో కలసి మొత్తంగా రెండు నుంచి మూడు వేల మందికి పైగా క్షేత్ర స్థాయి టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తుంది. రేవంత్ తో పాటు ఇప్పుడే వెళ్లితే తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా వుండదని కొందరు తొందరపడుతుండగా, ఇప్పుడే చేరడం తొందరపాటు అవుతుందని, ఇంకొన్ని రోజులు సమయం వేచి చూస్తే మంచిదన్న అభిప్రాయం మరికోంద మంది సీనియర్లలో వ్యక్తమవుతుందని సమాచారం. అయితే ఈ సమావేశానికి హాజరైన వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత దోమ్మాటి సాంబయ్య తీవ్ర చర్చకు కారణమయ్యారు. అయన రేవంత్ తో ఉన్న సన్నిహిత్యం కోసం వచ్చారా..? లేక ఫిరాయిస్తున్నారా..? అన్న చర్చకు తెరలేపారు.

ఇప్పటికే నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడారేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే విషయమై తన కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అమె మాత్రం ఇంకా మరిన్ని రోజులు వేచిచూసే దోరణినే అవలంబిస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా, రేవంత్ వెంట ఇంకా ఎవరరెవరు నేతలు కాం్గరెస్ లోకి వెళ్లనున్నారన్న విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రేవంత్ ఇంటి చుట్టూ నిఘా పెట్టాయని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  TTDP leaders  chandrababu  KCR  Telangana  AP Intelligence  jubilee hills house  hyderabad.  

Other Articles