ill young girl conformed as pregnant, reports of rape 8 నెలల గర్భవతైన యువతి.. అత్యాచారం వెలుగులోకి..

Ill young girl conformed as pregnant reports of rape

rentapalla, yekula nagaraju, nazeer baig, satannapalli, guntur, crime on women, violence on women, harrassement on women, sexual assault on women, andhra pradesh, crime

A young girl who fell ill was conformed as pregnant, after parents took her to hospital, parents rescued her as she attempted suicide and police filed a case agianst accused yekula nagaraju.

8 నెలల గర్భవతైన యువతి.. అత్యాచారం వెలుగులోకి..

Posted: 10/27/2017 12:45 PM IST
Ill young girl conformed as pregnant reports of rape

మాయమాటలు చెప్పి తన పబ్బం గడుపుకోవాలని చూసిన ఓ నయవంచకుడైన యువకుడిపై పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. ఏడాదికి పైగా కాలం నుంచి యువతిపై లైంగికదాడికి పాల్పడుతూ.. అమెను తన మాయమాటలతో నమ్మించాడు. ఏకంగా ఎనమిది నెలల గర్భం దాల్చిన తరువాత కానీ అమెకు తాను తల్లిని కాబోతున్నానని తెలియలేదు. దీంతో అస్పత్రి వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుతో నయవంచకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన నవ్యాంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ నజీర్‌బేగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రెంటపాళ్ళకు చెందిన యువతి పొలం పనులకు వెళుతుండేది. అదే గ్రామానికి చెందిన ఏకుల నాగరాజు కొంతకాలంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ నెల 24న ఆమెకు అస్వస్థతగా ఉండడంతో కుటుంబసభ్యులు సత్తెనపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్ళారు.
 
పరీక్షించిన డాక్టర్లు ఆమె 8వ నెల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయగా నాగరాజు కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్నాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు మందలించటంతో మనస్తాపం చెంది అదే రోజు పురుగుమందు తాగింది. గమనించిన బంధువులు ఆమెను సత్తెనపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు, అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల నుంచి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చిన స్టేట్‌మెంట్‌ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rentapalla  yekula nagaraju  nazeer baig  satannapalli  guntur  andhra pradesh  crime  

Other Articles