tension prevails at Assembly over congress leaders arrest కాంగ్రెస్ ఛలో అసెంబ్లీలో టెన్షన్.. టెన్షన్..

Chalo assembly police arrests congress activists at gun park

Telangana Assembly, Telangana Assembly, Chalo Assembly, congress, arrest, anti farmrmer govt, TRS, Revanth reddy, congress, shabbir ali, ponguleti, sampath, Telangana, Telangana CM KCR, KCR, TRS, Maha kutami, TTDP, Revanth Reddy Termination, Revanth Reddy Sack, Revanth Reddy Oust, Revanth Reddy, Revanth Reddy Issue, TTDP L Ramana Revanth Reddy, Revanth Reddy Ramana, TTDP Ramana Letter Chandrababu, Revanth Reddy Unofficial Ban, Politics

Telangana Congress Leaders arrested by police for calling chalo assembly alleging that TRS government is anti farmer govt, and demanding to solve their problems

‘‘ఛలో అసెంబ్లీ’’.. టెన్షన్.. టెన్షన్.. కాంగ్రెస్ నేతల అరెస్ట్

Posted: 10/27/2017 11:26 AM IST
Chalo assembly police arrests congress activists at gun park

రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం గాంధీ భవన్‌ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన నేపథ్యంలో మార్గమధ్యంలో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టుకు సన్నధం అయిన క్రమంలో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో బయలుదేరి ర్యాలీగా వస్తుండగా, పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

గాంధీ భవన్ ఎదుటే భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న క్రమంలోనే వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పొన్నం ప్రభాకర్‌, సుధీర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, డీకే అరుణ; శశిధర్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీ సినియర్ నేతలను అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వ రైతువ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. తమ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Assembly  Chalo Assembly  congress  arrest  anti farmrmer govt  TRS  Telangana  Politics  

Other Articles