DSP surrendered in rowdy sheeter's murder case రౌడీషీటర్ హత్యకేసులో లోంగిపోయిన డీఎస్పీ రవిబాబు..

Dsp ravibabu surrendered in rowdy gedela raju s murder case

dsp in gedela raju murder case, dsp surrenderd in murder case, dsp dasari ravi babu surrendered in murder case, Dasari Ravibabu, rowdy sheeter murder, chodavaram police station, gedela raju, kakara padmalatha, vishakapatnam, crime

Being Accused in the murder of rowdy-sheeter Kopperla Satyanarayana Raju alias Gedela Raju, DSP Dasari Ravi Babu surrendered to chodavaram police.

రౌడీషీటర్ హత్యకేసులో లోంగిపోయిన డీఎస్పీ రవిబాబు..

Posted: 10/20/2017 12:05 PM IST
Dsp ravibabu surrendered in rowdy gedela raju s murder case

ఒక తప్పు చేసినప్పుడే దానిని సరిదిద్దుకోవాలని.. కానీ దానిని దాచడానికి ప్రయత్నిస్తే అనేక తప్పులు తెలియకుండానే చేస్తామని ఇలానే మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతుందని చట్టం మనకు అనేక ఘటనల ద్వారా ఉదహరిస్తుంది. ఈ విషయాలను చెప్పి.. పెడదారిబాట పట్టిన యువతను సన్మార్గంలో నడిపించాల్సిన డీఎస్పీ స్థాయి అధికారే.. వక్రమార్గం పడితే.. చివరకు కటకటాల పాలు కావడం ఖాయమే. ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిబాబు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.

నిజం నిలకడ మీదైనా సరే వెలుగులోకి వస్తుందని తెలిసి కూడా తప్పు మీద తప్పు చేసిన డీఎస్సీ దాసరి రవిబాబు.. తన తప్పులు బయటపడటంతో ఇక చేసేది లేక ఎట్టకేలకు చోడవరం పోలీస్‌ స్టేషన్ లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన కొపెర్ల సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.

రౌడీ షీటర్ గేదెల రాజు హత్య కేసుకు డీఎస్పీకీ సంబంధమేంటి..?

అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కూతురు కాకర పద్మలతను.. రౌడీ షీటర్ గేదెల రాజు చేత డీఎస్పీ హత్య చేయించాడన్న అభియోగాలు వున్నాయని కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్యకేసులో తనకు రావాల్సిన సుపారీ (డీఎస్సీ ఇస్తానని చెప్పిన డబ్బును) ఇవ్వకపోవడంతో డీఎస్సీ రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు స్థానిక పాత్రికేయుడు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా హత్య జరిగిన నుంచీ ప్రధాన నిందితులిద్దరూ పరారీలో వున్నారు.

కాకర పద్మలతతో డీఎస్పీకి సంబంధమేమిటీ..?

మాజీ ఎమ్మెల్యే కూతురైనందున్న కాకర పద్మలతతో దాసరి రవిబాబు సన్నిహితంగా మెలిగాడు. అది కాస్తా వారిద్దరి మధ్య వ్యక్తిగత, శారీరిక సంబంధాలకు కూడా దారితీసింది. అవసరాలను తీర్చుకున్న తరువాత రవిబాబు అమెను దూరం పెట్టాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. నయవంచన చేశాడని.. అమె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తాను వుంటున్న ఇంట్లోంచి కూడా తనను పంపేందుకు ఇంటి యజమానిపై తీవ్రమైన ఒత్తడి తీసుకువస్తున్నాడని తన పిర్యాదులో పద్మలత పేర్కొంది.

అ సమయంలో మధురవాడ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రవిబాబుపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్కడే విధులను నిర్వహిస్తే.. పద్మలత కు ప్రమాదం పొంచివుందన్న అలోచన చేసిన అధికారులు ముందుగా అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తరువాత రవిబాబును రీకాల్ చేసిన అధికారులు అయనకు అర్టీసీ విజిలెన్స్ విభాగం డీఎస్పీగా విధులను అప్పగించారు. పద్మలత వల్లే తనకు ఈ దర్భర పరిస్థితి వచ్చిందని భావించిన రవిబాబు.. అమెను హత్య చేయించడానికి రౌడీషీటర్ గేదెల రాజుతో కలసి ఒప్పందం చేసుకుని సుపారీ మాట్లాడుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles