TDP MLA stages fast over pathetic bus stand నడిరోడ్డుపై ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డి ధర్నా..

Ruling party mla protest against his own party negligence

kurnool mla bc janardhan reddy, ruling TDP MLA janardhan reddy, ruling mla, bc janardhan reddy, APSRTC, shidda Raghava Rao, bus stop, TDP, kovelakuntla, APRTC ED, P Rama Rao, kurnool, andhra pradesh

The ruling TDP MLA B C Janardhan Reddy was reportedly left with no option but to launch a relay fast to draw the attention of the ‘thick-skinned’ management of APSRTC on the poor condition of its bus station at Kovelakuntla in Kurnool district.

నడిరోడ్డుపై ధర్నాకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే..

Posted: 10/18/2017 01:23 PM IST
Ruling party mla protest against his own party negligence

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ది జరుగుతుందని అధికార పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న ప్రకటన్నీ ఉత్త మాటలేనని ఈ ఘటన దర్ఫణం పడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు తమను అదరిస్తునూ వున్నారని, ఉంటారని నంద్యాల, కాకినాడ ఎన్నికలలో పార్టీ హైకమాండ్ చెప్పిన మాటలు కూడా సత్యదూరమా..? అన్న అనుమానాలు రేకెత్తక తప్పదు.

ఇక అభివృద్దిని కోరుకుంటున్న తాము అందుకోసమే అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నామని వలసవెళ్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన మాట్లలో నిజముందా..? అన్న సందేహాలు కూడా ఉత్పన్నం కాకమానవు. ఇక తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక.. అభివృద్దిని కాంక్షించేవారందరూ టీడీపీలో చేరాలని పిలుపునివ్వడం కూడా.. ఆ పార్టీ నేతలు అరోపించినట్లు ఇతరాత్ర లభ్దిని అశించే కానీ.. అభివృద్దిని కాంక్షించి మాత్రం కాదన్న కూడా నిజమేనా..? అంటే అవుననే చెప్పాల్సివుంది.

ఇందుకు కారణం గత రెండున్నర నుంచి మూడేళ్లుగా ఏపీఎస్ అర్టీసీ అధికారులకు తాను వినతుల మీద వినతులు చేసినా.. ఏకంగా రావాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావుకు స్వయంగా కోరినా.. తమకు చేసిపట్టాల్సిందిగా ఎంత కోరినా.. పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. అయితే ఇదేదో పర్సనల్ పని అనుకుంటే పోరబాటే. తమ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన పనిని కూడా చేపట్టమని పదే పదే అడిగినా పట్టించుకోని అధికారుల తీరుపై బనగానెపల్లె ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తాను అధికారుల చుట్టూ తిరిగి పని చేసిపెట్టండీ బాబోయ్ అని అర్థించడానిక బదులు.. వారే తన వద్దకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అందుకు ఆయన చేసింది కేవలం ధర్నా. అధికార పార్టీకి ఈయన.. కోవెలకుంట్ల బస్టాండ్ దీనస్థితిని చూసి దానిని తక్షణమే అభివృద్ది చేయించాలని పూనుకుని అర్టీసి అధికారులకు చెప్పారు. తన మాటలను పట్టించుకోవడం లేదని, ఎంత చెప్పినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఏకంగా గ్రామస్థులు, ప్రయాణికులతో కలసి నిరసనకు దిగారు. అదికూడా సమస్యాత్మకమైన కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండులోనే.

రెండేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని చెబుతూ బస్టాండు ఎదుట దీక్ష చేపట్టారు. బస్టాండుకు రక్షణ గోడ కావాలని, మురుగునీరు పోయేందుకు డ్రైనేజీ వేయాలని, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న సెస్ తో స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ అధికారుల తీరు సరిగ్గా లేదని, అందువల్లే అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా నిరసనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ధర్నాకు దిగారన్న సమాచాం అందుకున్న అర్టీసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. కడప జిల్లా కేంద్రంగా పనిచేసే అర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి రామారావు. హుటాహుటిన కర్నూలు చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. కోవెలకుంట్ల బస్టాండుకు సంబంధించిన సమస్యలన్నింటినీ రెండు నెల్లలో పరిష్కారిస్తామని హామిఇచ్చారు. దీంతో తమ సమస్యలు పరిస్కారం కాని పక్షంలో మళ్లీ దీక్షకు దిగుతానని ఎమ్మెల్యే అర్టీసీ అధికారులకు తేల్చిచెప్పారు. అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ruling mla  bc janardhan reddy  APSRTC  shidda Raghava Rao  bus stop  TDP  kovelakuntla  kurnool  andhra pradesh  

Other Articles