SC says cannot ban Kancha Ilaiah's book ఆ పుస్తకంపై ‘కంచె’ వేయలేం: సుప్రీంకోర్టు

Supreme court says cannot ban kancha ilaiah s book

Kancha Ilaiah, Supreme Court, ‘Samajika Smugglerlu Komatollu’, Arya Vysya Association leader, Ramanjaneyulu, controvesial book, lawyer, SC verdict on controversial book, Professor Kancha Ilaiah book, Chief Justice of India, Deepak Mishra, freedom of expression, Professor’s ‘Post Hindu India’, . Arya Vysya, Telugu states

The Supreme Court delivered a crucial verdict on the book ‘Samajika Smugglerlu Komatollu’ by Professor Kancha Ilaiah. The court noted that it cannot order to ban the book just because it is controversy.

ఆ పుస్తకంపై ‘కంచె’ వేయలేం: సుప్రీంకోర్టు

Posted: 10/13/2017 03:32 PM IST
Supreme court says cannot ban kancha ilaiah s book

ప్రోఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అన్న పుస్తకం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఈ పుస్తకంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ సామాజిక వర్గాన్ని అవమానపర్చేలా.. అప్రతిష్టను మూటగట్టేలా వున్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాళ విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పిటీషన్ ను కొట్టివేసింది. ఐలయ్య పుస్తకం పై కంచెను వేయలేమని స్పష్టం చేసింది.

ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు.. కంచ ఐలయ్య రచించిన పుస్తకంపై పలు అభ్యరంతరాలను వ్యక్తం చేస్తూ.. సమాజంలోని ఓ కులాన్ని టార్గెట్ చేసి.. వారిని దూషించే విధంగా పుస్తక రచన సాగిందని.. అందుచేత దానిని నిషేధించాలని కోరుతూ గత నెల దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారించిన న్యాయస్థానం పిటీషన్ ను కోట్టివేసింది. ఇలా చేయడం వ్యక్తుల భావప్రకటనా స్వేఛ్చకు విఘాతం కల్గించడమేనని స్పష్టం చేసింది.

రామాంజనేయులు పిటిషన్ ను  విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రోఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగర్లు కోమటోళ్లు అన్న పుస్తకాన్ని తాము నిషేధించలేమని స్పష్టం చేసింది. పిటీషనర్ ఇలా కోరడం.. రచయిత భావప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది.అయితే, రచయితలు స్వీయనియంత్రణ పాటించాలని సూచించగలమే తప్ప, వివాదాస్పదమైన కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేమని న్యామూర్తులు వ్యాఖ్యానించారు.

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పుస్తకాన్ని నిషేధించలేమంటూ ఇచ్చిన తీర్పును రచయిత ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య స్వాగతించారు. తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వించాలని అన్నారు. అంతేకాని తన పుస్తకాన్ని బ్యాన్ చేయాలని చెప్పడం ఎలా సమాజహితమవుతుందని ఆయన అర్యవైశ్యులను ప్రశ్నించారు. ‘పోస్ట్‌ హిందూ ఇండియా’ పుస్తకం.. 2006లో ‘హిందూ మతానంతర భారతదేశం’ గా తెలుగులోకి అనువాదమైంది. ఆ పుస్తకంలోని ఒక అధ్యయాన్ని ఇటీవలే ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పేరుతో విడిగా ముద్రించారు. దీనికి రచయిత మరో ముందుమాటను రాయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles