gali sensational comments on his defeat ఓటమికి కార్యకర్తలే బాధ్యులు.. మంత్రి ఛాన్స్ మిస్..

Gali muddukrishnamanaidu sensational comments on his defeat

gali muddukrishnamanaidu, 2014 elections, MLA RK Roja, Minister, puthur, Telegu Desam Party, TDP, YSRCP, Congress, BJP, CPI, CPM

The Senior Telegu Desam Party leader gali muddukrishnamanaidu says party activist are responsible for his defeat in 2014 elections. He says he would be minister if won the elections.

ఓటమికి కార్యకర్తలే బాధ్యులు.. మంత్రి ఛాన్స్ మిస్..

Posted: 10/13/2017 12:28 PM IST
Gali muddukrishnamanaidu sensational comments on his defeat

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమి బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని అరోపించారు. తన నుంచి అనేక సేవలను పోందిన పార్టీ నాయకులు కార్యకర్తలు.. అ మేరకు ఎన్నికలలో మాత్రం పనిచేయలేదని అవేదన వ్యక్తం చేశారు. ఇది తన దురదృష్టమనే చెప్పాలన్నారు. పుత్తూరులో నగరి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఆయన అవేదన భరిత ప్రసంగాన్ని చేశారు.

అధిష్టానానికి తన గురించి తెలుసు కాబట్టి.. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అన్నారు. అదే తాను ఎన్నికలలో విజియం సాధించివుంటే.. కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని అభిప్రాయపడ్డారు.
కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా వున్న హాయాంలో ఆయన వద్దకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వెళ్లి పేదలకుసీఎం రిలీఫ్ ఫండ్ తీసుకువచ్చిన ఘనత తనదని తెలిపారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబును ఒప్పించి జిల్లాలో 80 మందికి రూ.60 లక్షలు సీఎం రిలీఫ ఫండ్ తీసుకొచ్చానని చెప్పారు,
 
ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తరువాత నగరి రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. గృహ నిర్మాణంలో 6200 ఇళ్లు మంజూరు చేసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇంకా మరో వెయ్యి ఇళ్ళ మంజూరుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి పార్టీ ప్రతిష్ట పెంచాలన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి వార్డు, బూత్ కమిటీలకు ఇద్దరి నుంచి ఐదుగురిని నియమించుకుని ఓటర్లను కలిసి ప్రభుత్వ పథకాలు తెలియజేయాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : gali muddukrishnamanaidu  2014 elections  MLA RK Roja  Minister  puthur  Telegu Desam Party  TDP  YSRCP  Congress  BJP  CPI  CPM  

Other Articles