Case filed against actor Santhanam over assault కమేడియన్, హీరోపై కేసు.. అదృశ్యం..

Actor santhanam approaches hc for anticipatory bail in assault case

santhanam, santhanam assault case, santhanam controversy, santhanam, Shanmugasundaram, Chennai, Marriage hall, premanand, comedian, hero, physical assault, Anticipatary bail, kollywood, Tamil Nadu, Crime

Fearing arrest in connection with a case of physically assaulting a realtor, Santhanam approached the Madras High Court seeking an anticipatory bail.

కమేడియన్, హీరోపై కేసు.. పరారీలో నటుడు

Posted: 10/11/2017 09:51 AM IST
Actor santhanam approaches hc for anticipatory bail in assault case

ఆర్థికలావాదేవీలు ఎంతటి మంచి మిత్రులనైనా దూరం చేస్తాయి.. ఎంతటి మంచి వ్యక్తులమద్యనైనా వైరాన్ని తీసుకువస్తాయన్న పెద్దల చెప్పిన మాట మరోమారు అక్షరాల నిజమైంది. సమస్యను పరిష్కరించకునేందుకు వ్యాపార భాగస్వాములు అనుసరించిన విధానం కాలీవుడ్ ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైయ్యేందుకు కారణమైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. కాలీవుడ్ లో ఈ వార్త దవాణంలో వ్యాపించడంతో సంచలనంగా మారింది.

కాలీవుడ్ లో హాస్యనటుడి అరంగ్రేటం చేసి.. హీరోగా ఎదిగి రాణిస్తున్న సంతానంపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసేందుకు యత్నించగా ఆయన పరారీలో వున్నారని సమాచారం తమిళ చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. చెన్నై, వలసరవాక్కం, చౌదరినగర్ కు చెందిన కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు చేశారు. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చారు.

అనివార్యకారణాల వల్ల దానిని విరమించుకుని.. కాంట్రాక్టర్ ను తన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా కోరాడు. కొంత డబ్బ చెల్లించని షణ్మగసుందరం.. మిగిలిన డబ్బును ఇచ్చేందుకు కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో సంతానం తన మేనేజర్‌ రమేష్ తో కలసి షణ్ముగసుందరం కార్యాలయానికి వెళ్లి డబ్బు డిమాండ్ చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి.. అదికాస్తా స్వల్ప ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో షణ్ముగసుందరం, అతని స్నేహితుడు, బీజేపి నేత, న్యాయవాది ప్రేమానంద్ కు గాయాలయ్యాయి. దీంతో వారి నుంచి పిర్యాదు అందుకున్న పోలీసులు సంతానంను అరెస్టు చేసేందుకు వెళ్లగా ఆయన పరారీలో వున్నాడని తెలిపారు. కాగా ముందస్తు బెయిల్ కోసం సంతానం యత్నిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : santhanam  Shanmugasundaram  Chennai  Marriage hall  premanand  comedian  hero  physical assault  crime  

Other Articles