Congress seeks Salaria's disqualification బీజేపి అభ్యర్థి పరువు పాయే.. ఆ ఫోటోలు వైరల్..

Bjp candidate accused of rape complainant makes intimate pics public

punjah congress, disqualification, election commission, chief election commissioner, Gurdaspur bypoll, Punjab bypoll, Punjab by-election, Swaran Salaria, Punjab, obscene photos, crime

In a major blow to the Bharatiya Janata Party Party (BJP), its candidate for the Gurdaspur by-poll in Punjab Swaran Salaria has been accused of rape.

బీజేపి అభ్యర్థి పరువు పాయే.. ఆ ఫోటోలు వైరల్..

Posted: 10/06/2017 04:35 PM IST
Bjp candidate accused of rape complainant makes intimate pics public

పంజాబ్ గురదాస్‌పూర్‌ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వ్యాపారవేత్త స్వరన్ సలారియా తనను వివాహం చేసుకుంటానని నమ్మించి సర్వం దొచుకున్న తరువాత తనను దూరం పెడుతున్నాడని ఆరోపించిన బాధితురాలు అతడి ఎన్నికలలో పాల్గననీయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అమె దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించారు. తనను అవసరం తీరిన తరువాత పెళ్లి పేరు కూడా ఎత్తకుండా తనను బానిసకన్నా అధ్వానంగా చూస్తున్నారని అరోపించారు.

ముంబైకి చెందిన బాధితురాలు.. తనను సలారియా 1982 నుంచి 2014 వరకు వాడుకుని మోసం చేశాడని పిటీషన్ లో పేర్కోన్నారు.  పెళ్లి పేరుతో తనను మోసం చేసి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ.. అతినిపై అత్యాచారం కింద కేసు నమోదు చేయాలంటూ అరోపించారు. తొలుత పేయింగ్ గెస్టుగా పెట్టుకున్న సలారియా తరువాత తనకు ఒక ఫ్యాటును కూడా ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో స్వరన్ సలారియా తనతో ఏకంతంగా గడిపిన ఫోటోలు కూడా అమె పబ్లిక్ గా నెట్టింట్లో పెట్టడం సంచలనంగా మారింది.

ఈ ఫోటోలను ముఖ్యంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం ఓటర్లు విపరీతంగా షేర్ చేసుకోవడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. నటుడు వినోద్ ఖన్నా గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి పంజాబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరణంతో ఖాళీ అయిన గురుదాస్ పూర్ నియోజక వర్గానికి ఎన్నికల సంఘం అక్టోబర్‌ 11 ఉప ఎన్నిక నిర్వహించనుంది. దీంతో బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వరన్ సలారియా వ్యక్తిగత ఫోటోలు వైరల్ కావడంతో.. బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

 ఈ విషయంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్‌ సలారియా నామినేషన్‌ రద్దు చేయాలని జాతీయ ఎలక్షన్‌ కమిషన్‌ను కోరింది. పంజాబ్ అర్థికశాఖా మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్.. బీజేపితో పాటు సలారియా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆయనపై ఇప్పటికే నమోదైన క్రిమినల్ కేసులను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో వాటి వివారాలను ఎందుకు పోందుపర్చాలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సలారియాపై ఐపీసీ 376, 420, 306 సెక్షలతో పాటు ఎస్సీ యాక్టు కింద కూడా మరో కేసు వుందని మన్ ప్రీత్ బాదల్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gurdaspur bypoll  Punjab bypoll  Punjab by-election  Swaran Salaria  Punjab  obscene photos  crime  

Other Articles