Congress Ready to elect New PCC Chief | ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్.. లాభం ఉందా?

Ap new pcc elections on the way

Andhra Pradesh, Congress Party, APCC New Chief, Congress party New Chief, PCC Chief Raghuveera Reddy

Andhra Pradesh Congress party ready to choose new Chief. Raghuveera Reddy term already completed and he shows Poor result. Due to that Party Don't want to contine him as PCC Chief. The New PCC Elections process will held in Vijayawada on October 10th.

కొత్త పీసీసీ చీఫ్ తో ఏంటి లాభం?

Posted: 10/05/2017 06:05 PM IST
Ap new pcc elections on the way

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రస్తుతానికైతే పునాదులతో సహా గల్లైంతన విషయం తెలిసిందే. ఆ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి పదవీ కాలం ముగియటంతో ఆయన్ను మరికొంత కాలం కొనసాగించే ఉద్దేశ్యంలో అధిష్టానం ఏ మాత్రం లేదు. ఇప్పటిదాకా ఆయన సాధించిన ఘనతలే అందుకు కారణం. దీంతో కొత్త చీఫ్ ఎంపిక ఖాయమేనే సంకేతాలు అందించింది అధిష్టానం.

అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఈ నెల 10న ఏపీసీసీ అధ్య‌క్షుడి ఎన్నిక జ‌రుగుతుంద‌ని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మునియ‌ప్ప అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల ప్రక్రియ‌లో భాగంగా నూత‌నంగా ఎన్నికయిన 278 పీసీసీ స‌భ్యులతో విజ‌య‌వాడ‌లోని ఐవీ ప్యాలెస్‌లో ఈ నెల 10న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు మొదటి స‌మావేశం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ స‌మావేశంలోనే ఏపీసీసీ కార్య‌వ‌ర్గ స‌భ్యులు కూడా ఎన్నుకోబ‌డ‌తార‌ని అన్నారు. అయితే ఇప్పటికే సీనియర్ నేతలంతా ఒక్కోక్కరుగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరోపక్క ఎవరి దాిర వాళ్లు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక పార్టీకి ఏ మేర లాభం చేకూరుస్తుందన్నది అనుమానమేనన్నది విశ్లేషకుల మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles