Imd alerts heavy rainfall in hyderabad and Telangana బారీష్ అలర్గ్: మరో 48 గంటలు అప్రమత్త అవసరం

Cloudburst triggers mayhem hyderabad drowns in 2 hour deluge

hyderabad rains, hyderabad weather, rains in hyderabad, hyderabad monsoon, hyderabad rainfall, hyderabad rain, water logging hyderabad, weather in hyderabad, bombay rains, imd, imd satellite image, hyderabad rain logjam, Hyderabad drowns, Greater Hyderabad, Bay of Bengal, Arabian Sea, Amberpet

A mammoth cumulonimbus cloudburst over a wide area of Greater Hyderabad triggered a deluge with 13.25cm rain pounding the city in just a two-hour span.

బారిష్ అలర్ట్: మరో 48 గంటలు అప్రమత్త అవసరం

Posted: 10/03/2017 11:54 AM IST
Cloudburst triggers mayhem hyderabad drowns in 2 hour deluge

హైదరాబాదులో అరగంటలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలే ఏకధాటిగా నాలుగు గంటల పాటు కుంభవృష్టి కురిపించడానికి కారణమయ్యాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉత్తర ఒడిషా నుంచి ఉత్తర కేరళ మీదుగా రాయలసీమ, తెలంగాణకు ఆవర్తన ద్రోణి ఆవరించి ఉండడం, దానికి అనుగుణంగా మధ్యతూర్పు బంగాళఖాతంలో మరో ద్రోణి ఏర్పడడంతో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతోంది. వీటి మూలంగా పిడుగుల పడే అవకాశాలు వుంటాయని అంచనా వేశామని, అయితే కేవలం అరగంట వ్యవధిలోనే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి నగరంలో వర్షభీభత్సం సృష్టించిందని అన్నారు.

అక్టోబర్ మాసంలో తెలంగాణలో నిన్న కురిసిన వర్షం అత్యధిక స్థాయిని నమోదు చేసుకుందని అన్నారు. ఉపరితల ఆవర్తనానికి తోడు వాతావరణం ఒక్కసారిగా చల్లడడం కూడా కుంభవృష్టికి కారణమంటున్నారు అధికారులు. వెదర్ చల్లబడడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు దంచికొడుతున్నాయని చెప్తున్నారు. ఆదివారంతో పోలిస్తే… సోమవారం పగలు కాస్త చల్లబడినా… ఉష్ణోగ్రతలు సాధారణం కన్న ఒక డిగ్రీ పెరిగి 32 డిగ్రీలకు చేరింది. ఇక గాలిలో తేమ కూడా 87శాతానికి చేరడంతో వెదర్ కూలయ్యిందని… దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసిందని చెప్తున్నారు.

కాగా ఉపరితల అవర్తనం, ఉపరితల ద్రోణుల ప్రభావం ఇంకా తెలుగురాష్ట్రాలపై ఉందని దీంతో ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు ఉపరితల అవర్తనాల ప్రభావం వుంటుందని కూడా చెబుతున్నారు. వాతావరణం ఇవాళ కూడా చల్లగానే వున్న నేపథ్యంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పాడి వర్షం కురిసే అవకాశాలు కూడా వున్నాయని.. వాతావరణ శాఖ అధికారులు పేర్కోంటున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల కన్నా రాజధాని హైదరాబాద్ లోనే 36శాతం అదనంగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబర్ లో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. అత్యధికంగా మీరాలంలో 13.2 సెం.మీ, రాజేంద్ర నగర్ లో 12.6 సెం.మీ, అంబర్ పేటలో 12.3, గోల్కొండలో 10.4., మోండా మార్కెట్ లో 10.4 సెం.మీ,ముషీరాబాద్, కాప్రాలో 9.5 సెం.మీ, నారాయణగూడలో 9.3 సెం.మీ, సైదాబాద్ లో 9.1 సెం.మీ, బండ్లగూడ 8.9 సెం.మీ, ఎల్భీ నగర్ 8.4, చార్మినార్ 7.6, అమీర్ పేటలో 7.5 సెం.మీల వర్షం కురిసిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rain  cumulonimbus clouds  hyderabad  water logjam  imd  weather  

Other Articles