Shot gun backs Sinha critisizes Modi national interest యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన బీజేపి ఎంపీ..

Shatrughan backs yashwant sinha critisizes modi national interest

Yashwant Sinha, Arun Jaitley, GDP, Economic Slowdown, yashwant sinha latest article, Shatrughan Sinha, i need to speak up now, yashwant sinha opinion, yashwant sinha column

Shatrughan Sinha said Yashwant has "shown the mirror" to the government on the economic condition of India and its policy implimentation.

యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన బీజేపి ఎంపీ..

Posted: 09/28/2017 07:05 PM IST
Shatrughan backs yashwant sinha critisizes modi national interest

దేశ అర్థిక వ్యవస్థ మందగమగమనంలో సాగుతుందని.. సంచలన వ్యాఖ్యలు చేసి.. సొంత ప్రభుత్వంపై విమర్శల జడివానను కురిపించన బీజేపి సీనియర్ నేత.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు బీజేపి ఎంపీ, బాలీవుడ్ నటుడు, షాట్ గన్ గా పేరొందిన శతృఘ్న సిన్హా సమర్ధించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని అన్నాడు. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు తీరును ఆయన అక్షేపించారు.

దేశంలోనే విజయవంతమైన అర్థికశాఖ మంత్రుల్లో ఒకరిగా నిలిచిన సిన్హాపై పార్టీ నేతలు విమర్శలను గుప్పించడంపై ఆయన మండిపడ్డారు. యశ్వంత్ సిన్హా అసలైన రాజనీతిజ్ఖుడని వాస్తవ పరిస్థితినే ఆయన ప్రతిబింబించారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను సిన్హా ఎత్తిచూపించారని అన్నారు. ఇప్పటికే పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదించిన షాట్ గన్.. సిన్హాను విమర్శించిన నేతలనూ టార్గెట్‌ చేశారు. పార్టీ, దేశ ప్రయోజనాల కోసం యశ్వంత్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు.

యశ్వంత్‌ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చేయడం చౌకబారు, దిగజారుడు చర్యలేనని వరుస ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని, జాతి ప్రయోజనాలే ముందువరుసలో ఉంటాయని ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యశ్వంత్‌ సిన్హా రాసిన ప్రతి ఒక్కటీ పార్టీ, దేశ ప్రయోజనాల కోణంలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డుతున్నానని శత్రుఘ్నసిన్హా ట్వీట్‌ చేశారు. దేశంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక మం‍త్రుల్లో ఒకరిగా యశ్వంత్‌ పేరొందారని, దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yashwant Sinha  Arun Jaitley  GDP  Economic Slowdown  Shatrughan Sinha  UPA  India First  National Interest  

Other Articles