Indian Army strikes Naga insurgents along Myanmar border మయన్మార్ సరిహద్దులో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్

Indian army strikes naga insurgents along myanmar border

SURGICAL STRIKES, INDIAN ARMY, what is surgical strikes, surgical strikes 2.0, pm narendra modi, pm modi, narendra modi, indian army, eastern command, Myanmar border, surgical strikes along myanmar border

Indian Army reported that there was a firefight with Naga insurgents alongside the India-Myanmar border in the wee hours of today.

మయన్మార్ సరిహద్దులో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్

Posted: 09/27/2017 05:48 PM IST
Indian army strikes naga insurgents along myanmar border

భారత భద్రతా బలగాలు మరోమారు సర్జికల్ స్ట్రైక్ చేసింది, ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులతో నాగా ఉగ్రవాదలును  చేసింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్‌ క్యాంప్స్‌ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్‌-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది.

మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఎస్‌ ఖప్లాంగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌ఎస్‌సీఎన్‌-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్‌, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian army  Naga militants  surgical strikes  myanmar border  border havens  insurgents  

Other Articles