President to inaugurate Shirdi airport సాయి శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి.. ఎయిర్ పోర్టు అవిష్కరణ

First test flight from mumbai lands at shirdi airport in 45 minutes

shirdi, sai nagar, sai samadi centenary celebrations, ramnath kovind, shirdi airport, shirdi international airport, maharashtra, mumbai, aeroplanes, air travel to shiridi, air connectivity to shirdi, hyderabad, banglore, chennai, vishaka, gannavaram

The first flight, part of the test run, landed at the Shirdi airport. An Alliance Air aircraft took off from Mumbai at 4.15pm and landed in Shirdi at 5pm. The same flight took off from Shirdi at 6pm to and reached Mumbai at 6.35pm.

సాయి శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి.. ఎయిర్ పోర్టు అవిష్కరణ

Posted: 09/27/2017 03:02 PM IST
First test flight from mumbai lands at shirdi airport in 45 minutes

షిరిడీ సాయినాథుడి దర్శనాన్ని ఒక్క రోజులో ముగించుకుని మళ్లీ తమ స్వస్థాలలకు చేరుకునేలా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజుల తరబడి అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణాలు చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు మార్గం కూడా అంతగా అనువుగా లేకపోవడం.. ఆ మార్గం ఇంకా అభివృద్దికి ఆమడ దూరంగా వుండటంతో.. భక్తులు కొంత నిర్లిఫ్తంగా వున్నారు. అయితే రైలు మార్గం వుందిగా అంటే.. అదీ అంతే.. కేవలం మన్మాడ్ నుంచి సాయినగర్ షిరిడీ చేరుకునేందుకే రెండున్నర గంటల సమయం పడుతుంది.

ఇదే సమయాన్ని సక్రమంగా వెచ్చిస్తే అదే సమయంలో ఏకంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా షిరిడీకి చేరుకోవచ్చు. మళ్లీ తిరిగి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అదెలా అంటే అదే వాయుమార్గం. పవిత్ర షిరిడీ సాయి దర్శనానికి వచ్చే సంపన్న, ఉన్నత మధ్య తరగతి భక్తులపై ఎట్టకేలకు సాయినాధుడు కటాక్షించాడు. షిరిడీలో వారి కోసం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని సిద్దం చేశారు.

సాయి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విమానాశ్రయం వచ్చనెల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అక్టోబర్ 1న విమానాశ్రయాన్ని ఆవిష్క‌రిస్తారు. అదే రోజు షిరిడీ నుంచి ముంబై వ‌ర‌కు వెళ్లే విమానాల‌ను కూడా ఆయన ప్రారంభించ‌నున్నారు. ఆ తరువాత షిరిడీలో ప్రారంభం కానున్న సాయినాథుడి మహా సమాధి శతాబ్ది ఉత్స‌వాలలో రాష్ట్రపతి హాజరుకానున్నారు.  షిరిడీలో సాయి దర్శనాన్ని చేసుకున్న తరువాత ఆయన ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారని స‌మాచారం.

కాగా విమానాశ్రయ రాకతో షిరిడీ సహా పరిసర ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ది బాటలో దూసుకుపోతాయని స్థానికులు అశాభావం వక్యం చేస్తున్నారు, దేశ అర్థిక రాజధాని ముంబై నుంచి షిరిడీకి కేవలం 40 నిమిషాలలో రావచ్చుని అధికారులు తెలుసగా, ఈ మేరకు ఇవాళ ముంబై నుంచి షిరీడీకి చేరుకున్న తొలి పరీక్షా విమానం.. ఏకంగా 45 నిమిషాల వ్యవధిలో చేరకుంది. దీంతో కొత్త ఏరోనాటికల్ రూట్ కావడంతో అలస్యమైందని, విమానాశ్రయం ప్రారంభం నాటికి ఈ సమయం కేవలం నలభై నిమిషాలకు చేరుకుంటుందని షిరిడీ ఏటీసీ అధికారవర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shirdi  sai nagar  sai samadi centenary celebrations  ramnath kovind  shirdi airport  

Other Articles