Gorkhaland shutdown to finally end after 104 days ఇక అక్కడ సాధారణ స్థాయి జనజీవనం.. పర్యాటకం పున:ప్రారంభం

Darjeeling crisis comes to an end after 104 days following appeal by hm

Binay Tamang, Darjeeling unrest, Darjeeling crisis, Darjeeling, seperate state, Gorkha Janmukti Morcha (GJM), Gorkhaland, Bimal Gurung, tourism, Kalimpong, West Bengal, latest news

The Gorkha Janmukti Morcha (GJM) calls off indefinite shut down in Darjeeling hills from Wednesday after home minister Rajnath Singh's appeal to the Bimal Gurung-led party to end its 104-days-long agitation

ఇక అక్కడ సాధారణ స్థాయి జనజీవనం.. పర్యాటకం పున:ప్రారంభం

Posted: 09/27/2017 11:04 AM IST
Darjeeling crisis comes to an end after 104 days following appeal by hm

కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ వద్దని, తమకు ప్రత్యేక రాష్ట్రం కోసం గత 104 రోజులుగా నిరవధిక నిరసనలు, అందోళనలతో అట్టుడికిపోయిన గూర్ఖాల్యాండ్ లో ఇవాళ ఉదయం నుంచి సాధారణ పరిస్థితులు చేరుకుంది. గత కొన్న నెలలుగా అలుముకున్న అందోళన వాతావరణంతో ముగిసి సాధారణ ప్రజాజీవనానికి నేటి నుంచి చేరుకుంది. అందోళనలు, నిరసనలతో సాధించాలని అనుకున్నదేదీ అంత త్వరగా సాధ్యంకాదని, ప్రజాస్వామ్య పద్దతుల ద్వారా రాజ్యంగా బద్దంగా చర్చించికోవడం ద్వారా ఏదైనా సాధ్యమన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వినతిని పరిగణలోకి తీసుకున్న గుర్ఖాల్యాండ్ నేతలు తమ అందోళనను తాత్కాలికంగా విరామాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిరసనలు లేని గూర్ఖాల్యాండ్ లో మళ్లీ త్వరలోనే పర్యాటకల తాకిడి పెరగనుంది. మరీ ముఖ్యంగా డార్జిలింగ్ ప్రాంతంలో పర్యాటకలకు కనువిందు చేయనుంది.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ పై వున్న గౌరవంతో ఆయన మాటలపై వున్న విశ్వాసంతో.. చిన్న రాష్ట్రాలకు బీజేపి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న గత చరిత్రను పరిగణలోకి తీసుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఈ నిర్ణయానికి వచ్చే ముందు తమ ప్రాంత సీనియర్ నేతలతో చర్చించామని కూడా గూర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా నాయకులు తెలిపారు. అందోళన బాట వీడి.. చట్టపరమైన మార్గాల్లో చర్చలకు రావాలని ఆయన పిలుపుకు జీజేఎం నేతలు స్వాగతించారు.

గూర్ఖాల్యాండ్ నేతలు అందోళన బాట వీడటానికి కేంత్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వినతి ఓ కారణం కాగా, మరో కారణం అతిపెద్ద పండుగ దసరా నవరాత్రులతో పాటు అ తరువాత వచ్చే దీపావళి కూడా వున్నందున స్వల్ప విరామం తీసుకోవాలని ఉద్యమనేతలు నిర్ణయం తీసుకున్నట్లు కూడా వారు చెప్పారు. అయితే కేంద్ర తమ దిగివచ్చామని తక్కువగా అంచనా వేయకుండా వెనువెంటనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గురాంగ్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles