Pakistan goofs up at UN with wrong picture of Gaza girl ఆకాశంపై ఉమ్మితే ఇదే జరుగుద్ది.. బుట్టాచోర్.. పాక్..!!

Pakistan ambassador lodhi tries to pass off palestinian victim as kashmiri

Pakistan, Pakistan reply at UNGA, Sushma Swaraj, Sushma Swaraj at UNGA, United Nations General Assembly, UNGA address, Maleeha Lodhi, Rawya abu Jom'a, Pakistan lies at UN, Kashmir, India, United Nations, Kashmir, Gaza victim, Rajnath singh

The country’s UN Mission even tweeted the photo Rawya abu Jom’a at the Shifa Hospital in Gaza City, and claimed it to be a picture from Kashmir.

బుట్టాచోర్.. పాక్ ఆరోపణలు అబద్దాలుగా తేలిపోయాయి..!

Posted: 09/25/2017 11:08 AM IST
Pakistan ambassador lodhi tries to pass off palestinian victim as kashmiri

పోరుగు దేశమైనా సక్యతతో మెలిగితే.. ఎంత అండ కావాలంటే అంత ఇస్తామన్ని చెప్పినా.. కుట్రలు, కుతంత్రాలతో అనుక్షణం తమ దేశాభివృద్దిపై గురి కన్నా భారత్ లో ఎలా అలజడులు సృష్టించాలా అన్న అంశంపైనే అధిక సమయాన్ని, ధనాన్ని వెచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ.. అనుక్షణం భారత్ పై విషం కక్కుతున్న పాకిస్థాన్ కపట బద్ది ఐక్యరాజ్య సమితి వేదికగా బట్టబయలైంది. నీతి, న్యాయం, ధర్మం తప్పి వారు చేసే తప్పుడు పనులన్నీ భారత దేశమే చేస్తుందని సిగ్గు తప్పి చెప్పిన పాకిస్తాన్ కు అకాశంపై ఉమ్మితే ఏం జరుగుతుందో ఇప్పడు తెలిసివచ్చింది. బట్టాచోర్ నాటాకాలు ఎక్కవ కాలం సాగవని నిరూపితమైంది.

దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా అడిన నాటకం బహిర్గతమేంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో గత మూడు రోజులుగా భారత్ పై అసత్యాలతో విరుచుకుపడుతున్న పాక్ తాజాగా మరో అతి పెద్ద అబద్ధం ఆడి భారత్ ను దోషిగా నిలబెట్టాలని చూడగా, అది కాస్తా బహిర్గమై.. పాక్ అనుసరిస్తున్న కపటబుద్దిని బట్టబయలు చేసింది. క్రితం రోజున యుఎన్ సమావేశంలో పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ మాట్లాడుతూ.. కాశ్మీర్ లో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తింది.

కాశ్మీర్ లో భారత అర్మీ బలగాలు ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నాయో ఈ చిత్రమే ప్రస్పుటిస్తుందని అరోపించిన అమె.. ముఖం నిండా పెల్లెట్ గన్స్ గాయాలతో ఉన్న ఓ బాలిక ఫొటోను చూపించి అమె కాశ్మీర్ బాలికని, ఏర్పాటు వాది బుర్హన్ వనిని కాశ్మీర్ లోని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేసిన అనంతరం చెలరేగిన హింసను అణిచివేసేందుకు భారత్ అర్మీ అక్కిడి స్థానికులను ఇలా చిత్రహింసలకు గురిచేసిందని కూడా అరోపించారు.

అయితే నిజానికి ఆమె చూపించిన బాలిక కశ్మీరీ కాదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన పాలస్తీనాలోని గాజాకు చెందిన బాలిక రవా అబు జోమా ఫొటో అది. అది కూడా 2014లో జరిగిన దాడుల అనంతరం జెరూసలేంకు చెందిన హైదీ లెవీన్ అనే ఫొటో జర్నలిస్ట్ ఈ ఫొటో తీశాడు. అప్పట్లో ఈ ఫొటో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే ఫొటోను ఉపయోగించుకుని భారత్‌పై మరోమారు అభాండాలు వేయాలని పాక్ ప్రయత్నించింది. బాధితురాలిని కాశ్మీర్ యువతిగా చెప్పేందుకు ప్రయత్నించి అంతర్జాతీయ సమాజం ముందు పాక్ బొక్కబోర్లా పడింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసి.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పాక్ కుట్రను భగ్నం చేసిన విధానాన్ని కూడా స్వాగతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  India  United Nations  Kashmir  Gaza victim  rawya abu kom's  maleeha lodhi  

Other Articles