Actress Shakila dies of heart attack సీనియర్ నటి షకీలా కన్నుమూత..

Babuji dheere chalna actress shakila dies of heart attack

actress shakila,shakeela,Yesteryear actress Shakeela,Babuji Dheere Chalna song,shakeela passed away,shakeela no more,shakila guru dutt,Actor Johnny Walker,Dev anand shakila CID,CID movie,Raj Kapoor shakila,shammi kapoor shakila,china town

Yesteryear actress Shakila (Shakeela), who is known for the song Babuji Dheere Chalna, passed away in Mumbai. She died from a massive heart attack aged 82.

ITEMVIDEOS: మొన్నటితరం నటి షకీలా కన్నుమూత..

Posted: 09/21/2017 03:25 PM IST
Babuji dheere chalna actress shakila dies of heart attack

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి షకీలా(82) కన్నుమూశారు. బాబూజీ ధీరే చల్నా.. అన్న పాపులర్ హింతీ పాట గుర్తుందా.. ఈ పాటపై నృత్యం చేసిన అలనాటి నటి షకీలా.. నిన్న మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో మరణించారు. ఆర్‌ పార్‌’, ‘సీఐడీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. గురుదత్; దేవానంద్, రాజ్ కపూర్, షమ్మికపూర్, వంటి అగ్రహీరోల సరసన కూడా నటించిన షకిల అప్పటి తర యువతరాన్ని ఉర్రతూలూగించారు. అమె నటించిన చిత్రాల్లోని పాటలు అప్పటి రేడియోల్లో, గ్రామోఫోన్లలో దేశవ్యాప్తంగా మార్మోగాయనడంలో అతిశయోక్తి కాదు.

గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీలా క్రితం రోజు మధ్యాహ్నం అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. షకిలా మరణ వార్తను ఆమె బంధువు నటుడు జానీ వాకర్ కుమారుడు నాసిర్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులు, మీడియాతో పంచుకున్నారు. ‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. మా పెద్దమ్మ షకీలా కన్నుమూశారు. 1950, 60ల్లో ఆమె ఓ గొప్ప నటిగా, స్టార్‌గా వెలుగొందారు. ‘బాబుజీ ధీరే చల్నా’, ప్యార్‌ మే జరా సంభాల్నా’ అందరికీ గుర్తుండిపోతాయి.

ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. గురువారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తాం.’ అని పేర్కొన్నారు. షకీలా ‘శ్రీమాన్‌ సత్యవాది’, ‘చైనా టౌన్‌’, ‘పోస్ట్‌బాక్స్‌ 999’, ‘దస్తాన్‌’, ‘సింధ్‌బాద్‌ ద సెయిలర్‌’, ‘రాజ్ రాణి దమయంతి’, ‘ఆఘోష్‌’, ‘రాజ్ మహల్‌’, ‘అలీబాబా ఔర్‌ చాలీస్ చోర్‌’, ‘షెహన్ షా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి, మెప్పించారు. ఆమె చివరిగా 1963లో ‘ఉస్తాదన్ కి ఉస్తాద్‌’ చిత్రంలో నటించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood  actress  shakila  shakeela  Babuji Dheere Chalna song  passed away  

Other Articles