‘Cashless’ village in Maharashtra has returned to cash పది మాసాల్లోనే సీన్ రివర్స్.. అన్నీ ఆ లావాదేవీలే..

Revisiting demonetisation cashless village in maharashtra has returned to cash

Dhasai, Cashless village India, Maharashtra first cashless village, Maharashtra demonetisatoin, Notebandi in Maharashtra, Kalyan Dhasai, Savarkar Association

With cash flowing freely the second cashless of India once again goes to monetary transactions, as merchants reckon with transaction fees, fluctuations in network connectivity and a simple lack of debit cards among customers.

పది మాసాల్లోనే సీన్ రివర్స్.. అన్నీ ఆ లావాదేవీలే..

Posted: 09/20/2017 10:09 AM IST
Revisiting demonetisation cashless village in maharashtra has returned to cash

పెద్ద నోట్ల రద్దు పేరుతో నగదు మార్పిడి చేసిన కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాల అమలులో భాగంగా అంత కన్నా పెద్ద నోటును దేశీయ అర్థిక వ్యవస్థలోకి అమల్లోకి తీసుకువచ్చిన నేపథ్యంలో యావత్ దేశంలో నగదు కొరత ఏర్పడటంతో.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. నగదు కోసం ప్రజలు పడుతున్న పాట్లే కనిపించాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని థానే ప్రాంతంలోగల ధసాయ్ గ్రామం అందరి దృష్టిని అకర్షించింది. యావత్ గ్రామం నగదు రహిత లావాదేవీలను చేస్తూ.. వార్తలోకి ఎక్కింది.

అయితే ఇలా జరిగిన ఎనవిమి నెలల లోపే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. నూటికి నూరుపాళ్ల డిజిటల్‌ గ్రామంలో ఇప్పడు కనీసం 20 నుంచి 25శాతం కూడా నగదు రహిత లావదేవీలు జరగడం లేదు. నగదు విషయంలో ఎలాంటి కొరత లేకుండా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో 80 శాతం మందికిపైగా మళ్లీ నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. ఇక స్టేట్ బ్యాంక్ అప్ బరోడా తమకు ఉచితంగా అందించిన నగదు రహిత లావాదేవీల మెషీన్లు (స్వైపింగ్ కార్డు మిషన్లు) కూడా ఇప్పడు గ్రామంలోని వ్యాపారస్థుల వద్ద లేవు.

ఇక దాదాపుగా 25 శాతం మంది వ్యాపార్తుల వద్ద ఈ మెషన్లు వున్నా వాటని పక్షం రోజులకోసారి కూడా వినియోగించడం లేదు. అందుకు నగదు లభ్యం కావడం ఓ కారణం కాగా, నగదు రహిత లావాదేవీలపై పడుతున్న అదనపు చార్జీలు మరో కారణం. దీనికి తోడు నెట్ వర్క్ కనెక్టవిటీలో అంతరాయం, అదీకాక అసలు సమస్య ఏంటేంటే ధసాయ్ గ్రామంలో మొత్తంగా 25 శాతం మంది ప్రజల వద్దే ఏటీయం కార్డులు అందుబాటులో వుండటం.

దీంతో తమ వ్యాపారాలను డిజిటల్ గా మార్చినప్పటికీ.. ప్రజల నుంచి స్పందన కరువై అసలు వ్యాపారాలు జరగకపోవడం.. జరిగినా గతానికి. నోట్ల రద్దు తరువాత జరిగిన లావాదేవీలకు పొల్చితే కనీసం 20 నుంచి 25 శాతం మాత్రమే ఉండటంతో.. నగదు రహిత లావాదేవీలకు స్వస్తి పలికి తాము మళ్లీ నగదుతోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles