Astra missile completes development trials భారత అమ్ములపోదిలో చేరిన మరో ‘అస్త్రం’

Astra missile s final development flight trials successful

astra missile, astra missile vs meteor missile, astra missile mk2, astra missile vs derby missile, astra missile induction, astra missile comparison, best bvr missile, astra missile india, astra missile images, iaf astra missile, astra missile drdo

Astra, India's first indigenously developed beyond-visual-range air-to-air missile, has successfully completed development trials! The importance of this addition to Indian Air Force's (IAF) firepower cannot be overstated.

భారత అమ్ములపోదిలో చేరిన మరో ‘అస్త్రం’

Posted: 09/16/2017 10:38 AM IST
Astra missile s final development flight trials successful

భారత అమ్ములపోదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. దేశ రక్షణ వ్యవస్థ మరింత బలంగా తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అస్త్రి క్షిపణి పరీక్ష విజయవంతంగా ముగిసింది. దీంతో భారత వాయునేస మరింత దృడంగా మారింది. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ (బీవీఆర్ఏఏఎం) 'అస్త్ర' చివరి పరీక్షను అధికారులు నిర్వహించి విజయవంతం చేశారు. ఒడిశాలోని చాందీపూర్‌లో గత నాలుగు రోజులుగా వరుసగా నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి.

దీంతో ఈ క్షిపణి అభివృద్ధి దశ పూర్తయినట్టే. బంగాళాఖాతం మీదుగా నిర్వహించిన అస్త్ర బీవీఆర్ఏఏఎం విజయవంతమైనట్టు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెప్టెంబరు 11 నుంచి 14 వరకు చాందీపూర్‌లో వరుసగా ఏడు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. అతి త్వరలోనే ఈ క్షిపణులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశపెట్టనున్నట్టు వివరించింది.

భారత వాయుసేన సహకారంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. అస్త్ర పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డీఆర్‌డీఓ, వాయుసేన అధికారులను అభినందించారు.  ఎయిర్ టు ఎయిర్, సర్ఫేర్ టు ఎయిర్ క్షిపణులను మరిన్ని అభివృద్ధి చేస్తామని డీఆర్‌డీఓ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జి.సతీష్ రెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles