తెలుగు రాష్ట్రాలల్లోమరో రెండు, మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్ల మీదుగా కొనసాగుతున్న ఉపరితల అవర్తనం, ఉపరతల ద్రోణి నేపథ్యంలో రానున్న శని, అదివారాల్లో అన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అదివారం రోజు తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తారులో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా తోడవ్వడంతో, కర్ణాటక మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా క్యుములోనిం బస్ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం పడే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉధృతమైన వర్షం కురవడానికి కూడా ఈ మేఘాలే కారణమని తెలిపారు.
ఇప్పటికీ తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈ మేఘాటు దట్టంగా అలుముకునే అవకాశముందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గత బుధవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్, సంగారెడ్డి, తాండూరులో గరిష్టంగా 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more