Traffic jams, stink, Karnataka CM grins and bears it! ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న రాజకీయ ధురంధరుడు

Traffic jams stink karnataka cm grins and bears it

Siddaramaiah, Siddaramaiah news, stinking storm water drain, stinking storm water drain news, BMTC bus, BMTC bus news, Siddaramaiah's cabinet colleagues, rain-affected areas, chief minister Siddaramaiah, BMTC Volvo bus, Bengaluru's Kalkere

CM Siddaramaiah had the real taste of Bengaluru. Right from stinking storm water drain to the BMTC bus, which he boarded to go on an inspection of the city, not starting right in the middle of a road, and travelling on pothole filled roads and traffic jams, he experienced it all.

ITEMVIDEOS: ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్నముఖ్యమంత్రి

Posted: 09/14/2017 03:04 PM IST
Traffic jams stink karnataka cm grins and bears it

ఆయన సీనియర్ రాజకీయ నేత. అయితే రాజకీయ చక్రబంధంలో మాత్రం చిక్కుకున్న ఘటనలు లేవు. ఎప్పుడైనా అలా ఇలా తన చుట్టూ వలయాలు చేరుకుంటున్నాయన్నా.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్ని బయటపడతారు. అయితే అలాంటి ఆ సీనియర్ నేత.. కన్నడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అది రాజకీయ పద్మవ్యూహం కాదు. నగర రోడ్లపై అనునిత్యం రద్దీ సమయాల్లో ఏర్పడే ట్రాఫిక్ పద్మవ్యూహం.

ఇలాంటి ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకోవడం సామాన్య వాహనదారులకు సర్వసాధారణం, నిత్యకృత్యం. కానీ ఏకంగా ముఖ్యంత్రి ఇలాంటి సమస్యను ఎదుర్కొవడం ముమ్మాటికీ అశ్చర్యకరమే. కానీ ఈ అనుభవాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుర్కొన్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంతో పాటు బెంగళూరు మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన నగరంలోని పలు ప్రాంతాలను పర్యశీలించేందుకు.. పర్యటించేందుకు వెళ్తుండగా సిద్దిరామయ్య ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

నగరంలోని కేఆర్ పురం పరిధిలో పర్యటించడానికి ఆయన వెళుతుండగా...అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న సిద్ధరామయ్య కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈ ఘటనతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే, బస్సుకు మరమ్మతులు చేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  stinking storm water drain  city rounds  traffic jam  kalkere  bengaluru  

Other Articles