woman sits on man's lap, who refuses to give up seat యువకుడిపై కూర్చున్న మహిళ.. సీటివ్వలేదనట..

Elderly woman sits on man s lap who refuses to give up seat

elderly, Young man, elder generation, behave, disrespect, public, underground, subway, CCTV, nanjing city, china, viral video, video viral, funny video

After a young man refused to give up his seat to an elderly commuter on the subway in China’s Nanjing City, the furious lady took matters into her own hands and continued her trip sitting on the man’s lap.

ITEMVIDEOS: యువకుడి మీద కూర్చున్న మహిళ.. సీటివ్వలేదనట..

Posted: 09/12/2017 03:29 PM IST
Elderly woman sits on man s lap who refuses to give up seat

ఆంధ్రుల ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అడపడచులకు మాత్రం ఎనలేని మేలు జరిగింది. ఆ తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయినా.. అయన చేపట్టిన విధానాలను తూచా తప్పకుండా పాటించాల్సి వచ్చింది. వాటిలో అడపడచులకు అస్తిలో సమానవాటా మాదిరిగానే.. తెలుగింటి అడపడచులకు అర్టీసీ బస్సు ప్రయాణాల్లో రిజర్వేషన్ మరోకటి. ఈ విధానాలను 1984 నుంచి నేటికీ అమలు అవుతూనే వున్నాయి.

అయితే ఇలాంటి విధానాలు లేకుండా ఇప్పటికీ ఎవరికి లభించిన సీటులో వారు కూర్చోనే ప్రయాణించాల్సిన రాష్ట్రాలు అనేకం వున్నాయి. ఇటు మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో మహిళా ప్రయాణికులకు ప్రత్యేక వెసలుబాటు కానీ, లేక సిటు రిజర్వేషన్ కానీ లేదు. తమకు కూడా అన్నాగారి లాంటి నాయకుడు ఎవరో ఒకరు రాకపోతారా.. తమ బతుకులు బాగు చేయకపోతారా..? అంటూ అక్కడి అడపడచులు కూడా ఎదురుచూస్తున్నారు.  

అయితే మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ లేని చైనా.. వృద్దులకు, నిలబడలేని వారికి, అంగవైకల్యం వున్నవారికి మాత్రం పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు వున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో చైనాలో కూడా ఇవే రిజర్వేషన్లు అక్కడి సబ్ వేలలో కొనసాగుతున్నాయి. అలా ఓ సబ్ వే రైలులో వయోవృద్దులకు కేటాయించిన సీటులో ఓ యువకుడు కూర్చుని వుండటాన్ని గమనించిన ఓ మహిళ.. తనలాంటి వారికి కేటాయించిన సీటును తనకివ్వాల్సింది యువకుడ్ని కోరింది.

అయితే మహిళ వినతిని విన్న యువకుడు పట్టించుకోకుండా కూర్చున్నాడు. దీంతో సదరు మహిళ.. సీటు వెనకలా తాటికాయంత అక్షరాలతో ఈ సీటును ఎవరికోసం రిజర్వు చేశారో చూడాలని కూడా చెప్పింది. అయినా వినిపించుకోని యువకుడు సీటు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరికీ మధ్య వాదులాట కూడా జరిగింద. దీంతో ఒపిక నశించిన మహిళ.. యువకుడి తొడపైనే కూర్చింది. ఈ సంఘటన చైనాలోని నాన్‌జింగ్ ప‌ట్ట‌ణంలో స‌బ్‌వే మెట్రోరైలులో చోటుచేసుకోగా.. ఈ తతంగాన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తన మైబైల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles