Schools To Celebrate Modi's Birthday On Sunday మోడీ జన్మదినం.. అదివారం పాఠశాలలకు రావాల్సిందే..

Up s schools will remain open on sunday to celebrate modi s birthday

Narendra Modi, Uttar Pradesh, Union Ministry of Human Resource Development, Swachh Bharat, prime minister Narendra Modi, primary schools, day-wise action plan, anupma jaiswal, Yogi Adityanath, Uttar Pradesh

On Sunday, 17 September, Uttar Pradesh's 1.60 lakh schools will remain open with compulsory attendance for all students in the state to celebrate PM Modi's 67th birthday.

మోడీ జన్మదినం.. అదివారం పాఠశాలలకు రావాల్సిందే..

Posted: 09/08/2017 07:33 PM IST
Up s schools will remain open on sunday to celebrate modi s birthday

అదివారం వచ్చిందంటే ప్రతిరోజు మాదిరిగా కాకుండా కొంత ఆలస్యంగా నిద్రలేస్తారు ప్రజలు. మరీముఖ్యంగా ఉద్యోగులు.. పాఠశాల విద్యార్థులు.. ఎందుకంటే.. అదివారమంటే సెలవు దినం కాబట్టి. కానీ అన్ని అదివారాల్లో ఈ అదివారం వుండదు. అదేనండీ సెప్టెంబర్ 17న వచ్చే అదివారం మాత్రం వుండదు. ఎందుకంటే ఆ రోజు విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరుకావాల్సిందే. అదేంటి అదివారం రోజున పాఠశాలకా..? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారా..?.

అయినా సరే ఇదే నిజం. ఆ రోజు పాఠశాలు యధావిధిగా నడుస్తాయి. ఎందుకంటే ఆ రోజున ప్రధాని మోడీ పుట్టిన రోజు కాబట్టి. ప్రధాని జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రోజున విద్యార్థులందరూ పాఠశాలలకు విధిగా హాజరుకావాల్సిందేనని అదేశాలు జారీ చేసింది. మోడీ ఆదర్శ నాయకత్వాన్ని చిన్నారులకు తెలియ చేయాలని.. ఆయన స్ఫూర్తిని వారిలో నింపాలని భావిస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 60వేల పాఠశాలల్లో ప్రధాని పుట్టినరోజు వేడుకులు జరగనున్నాయని, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనూప్‌మా జైస్వాల్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో దత్తత తీసుకున్న స్కూళ్లకు వెళ్లి ప్రధాని ఆశయాలను పిల్లలకు తెలియజేయాలని ఆమె సూచించారు. స్వచ్ఛ్‌ భారత్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు పంచుతామన్నారు.  ప్రధాని స్వచ్ఛభారత్‌ కల గురించి విద్యార్థులకు తెలియజేయడం మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పుట్టిన రోజు బహుమతి అన్నారు జైస్వాల్‌. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రధాని అయిన నరేంద్ర మోడీ పిల్లలకు సరైన ఐకాన్‌ అని బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహాన్‌ అభిప్రాయపడ్డారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల పరిశుభ్రతపై ప్రచారం చేస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  primary schools  UP  Uttar Pradesh  Yogi Adityanath  

Other Articles