Photojournalists Attacked by Bouncers శిల్పాశెట్టి ఫోటో తీస్తావా..? జర్నలిస్టుపై పిడిగుద్దులు..

Photojournalists attacked by bouncers for clicking shilpa shetty raj kundra s picture

journalist attack, photojournalists attack, raj kundra, shilp shetty, shipa shetty-raj kundra, Crime

Two freelance photojournalists were punched and beaten up by bouncers of a Mumbai hotel when they were trying to click pictures of actor Shilpa Shetty and her husband Raj Kundra.

శిల్పాశెట్టి ఫోటో తీస్తావా..? జర్నలిస్టుపై పిడిగుద్దులు..

Posted: 09/08/2017 11:54 AM IST
Photojournalists attacked by bouncers for clicking shilpa shetty raj kundra s picture

బాలీవుడ్ నటీనటులే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నటీనటులు కేవలం మీడియా మూలంగానే వెలుగులోకి వచ్చారు. మీడియా, సోషల్ మీడియా లేకపోతే వారిని జనం కూడా మర్చిపోతారు. కేవలం మాద్యమాల బలంతోనే వారు ఉనికిని కాపాడుకుంటున్నారన్న విషయం వారికి తెలుసుకూడా. అయినా మీడియా కనబడగానే కసురుకుంటూ వెళ్లిపోతారు. మీడియా అంటే అంత చిత్కారం ఎందుకో మాత్రం అర్థంకాని ప్రశ్న.

మూడు రోజుల వ్యవధిలో ఇటు కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ కాల్చివేత ఘటనను మరువక ముందే అటు బిహార్ లో కూడా పంకజ్ అనే పాత్రికేయుడిపై కాల్పులు జరిపి అతని నుంచి డబ్బులను లాక్కెళ్లిన ఘటనతో దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైందన్న వార్తలు ఓ వైపు సంచలనంగా మారుతున్న క్రమంలోనే.. మహారాష్ట్రలో కూడా పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని బౌతికదాడులకు పాల్పడ్డారు ఇద్దరు హోటల్ బౌనర్లు.

దేశ అర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఇద్దరు ఫోటో జర్నలిస్టులపై స్టార్ హోటల్ బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. తాము ఫోటో జర్నలిస్టులమని చెబుతున్నా వినకుండా.. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రగాయాపాలు చేశారు. రుధిరగాయాలపాలైన జర్నలిస్టులు అస్పత్రిలో చికిత్స పోందతున్నారు. నిన్నటితరం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఫొటోలు తీసినందుకు ఫోటో జర్నలిస్టులపై దాడిచేశారు. ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లిన క్రమంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికి రెస్టారెంట్ కు నాటి నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి వెళ్లిందన్న సమాచారం అందుకున్న ఫొటో జర్నలిస్టులు రెస్టారెంట్‌ వద్దకు చేరుకున్నారు. శిల్పా, రాజ్‌లు కారులో నుంచి దిగగానే ఫొటోగ్రాఫర్లు గబగబా ఫొటోలు తీశారు. ఇందుకు రాజ్‌, శిల్పా కూడా సహకరించారు. కానీ రెస్టారెంట్‌ వద్ద ఉన్న బౌన్సర్లు మాత్రం వారి ఫొటోలు తీసినందుకు సోను, హిమాన్షు అనే ఇద్దరు ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. దీంతో ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసిన ఫోటోగ్రాఫర్లు.. అలాగే తమ మీడియా సంస్థలకు కూడా సమాచారం చేరవేసి అస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles