Criminalising marital rape: Supreme Court to hear plea today బలవంతపు శృంగారం నేరమౌనా..? కొనసాగనున్న వాదనలు

Government s refusal to criminalize marital rape is unjust inconsistent

Marital rape, sexual violence, National Family and Health Survey, Supreme Court, Narendra Modi government, NFHS data, health, marital rape criminal offence, child marriages, hindu marriage

The Supreme Court will hear a plea filed by an NGO seeking to make marital rape a criminal offence. The matter was earlier adjourned to September 4.

బలవంతపు శృంగారం నేరమౌనా..? కొనసాగనున్న వాదనలు`

Posted: 09/06/2017 09:18 AM IST
Government s refusal to criminalize marital rape is unjust inconsistent

బాల్య వివాహాలను ఓ వైపు కేంద్రం చెల్లదంటూనేూ.. మరోవైపు వారితో బలవంతంగా శృంగారంలో పాల్గోనే అవకాశాన్ని మాత్రం కల్పిస్తుందన్న నేపథ్యంలో దాఖలైన వాజ్యంపై ఇవాళ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారం.. అత్యాచారం కిందికి రాదని, వీటిని కూడా అత్యాచారాలుగా పరిగణిస్తే.. ఇక హిందూ వైవాహిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనకు సానుకూలంగా స్పందించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మధ్యే ఒక కేసులో తీర్పు వెలువరించింది.

ఈ నేపథ్యంలో మైనర్ భార్యతో భర్త శృంగారం కొనసాగించడానికి అనుమతిస్తున్న నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా బాలికలు తమ వివాహాలను రద్దు చేసుకునేందుకు వేర్వేరు చట్టాల కింద వేర్వేరు వయో పరిమితులు విధించడంలో ఉన్న తర్కం ఏంటని జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాల్య వివాహాల రద్దుకు ప్రత్యేక చట్టాలు అమలులో వున్నా.. అవి ఇంకా గ్రామీణభారతంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా యధేశ్చగా కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

బాల్యవివాహాలు అసలు పెళ్లిళ్లు కావని, ఎండమావులని ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇచ్చిన కేంద్రం... బాలికల వయసు 15–18 ఏళ్ల మధ్య ఉంటే వారి వివాహాన్ని రద్దుచేయవచ్చని పార్లమెంట్‌ బాగా ఆలోచించి, వివేకంతో నిర్ణయం తీసుకుందని తెలిపింది. దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బాల్య వివాహాలపై పార్లమెంటు చట్టాన్ని రూపొందించిందని స్పష్టం చేసింది. కాగా ఈ పిటీషన్ పై ఇవాళ కూడా ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles