మళ్లీ పేలిన రెడ్ మీ నోట్ 4.. ఈసారి చిత్తూరులో.. సేఫ్టీ కాదంటున్న నిపుణులు | Xiaomi Redmi Note 4 catching fire Chittoor district

Another xiaomi redmi note 4 smartphone goes up in flames

Xiaomi Redmi Note 4, Redmi Note 4 Blast, Redmi Note 4 Another Blast, Redmi Note 4 New Features, Redmi Note 4 Threat, Redmi Note 4 Customers Fear, Redmi Note 4 Customer Threat, China Xiaomi Redmi Note 4 Blast, Gangadhara Nellore Chittoor district Redmi Blast

After less than a month of reports of Xiaomi Redmi Note 4 catching fire in Bengaluru, and East Godavari. Now another case of the phone exploding and leading to injuries to a customer come up. According to a news portal, a Redmi Note 4 allegedly exploded in the pocket of a man, who sustained injuries on his thigh. The owner of the phone K Ajith who lives in Gangadhara Nellore in Chittoor district of Andhra Pradesh had bought the phone few days back.

రెడ్‌మీ మళ్లీ పేలిందిగా...

Posted: 09/02/2017 07:18 AM IST
Another xiaomi redmi note 4 smartphone goes up in flames

రెడ్ మీ ఫోన్ వినియోగదారుల్లో భయం పట్టుకుంది. చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షియోమీకి చెందిన రెడ్‌ మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు వరుసపెట్టి పేలుతున్నాయి. గత నెలలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా మంటలంటుకుని పేలిపోవడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ మధ్యే విశాఖపట్టణం జిల్లాలో చార్జింగ్ పెట్టిన కాసేపటికే ఫోన్ పేలింది. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరులో మరో ఫోన్ పేలింది. గ్రామానికి చెందిన కె.అజిత్ గురువారం రాత్రి ఇంట్లో ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది.

కాగా, రావులపాలెం ఘటనపై స్పందించిన షియోమీ యాజమాన్యం.. ఫోన్‌లో ఎటువంటి సమస్యా లేదని, అధిక ఒత్తిడే ఫోన్ పేలుడుకు కారణమని పేర్కొంది. రెడ్‌మీ నోట్ 4 ఫోన్లు వరుస పెట్టి పేలిపోతుండడంపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంటే... కొత్తగా ఫోన్ కొనాలనుకుంటున్న వాళ్లు ఆలోచనలో పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు చైనా ఈ రకంగా భారత్ పై యుద్ధం చేస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Redmi Note 4  Phone Blast  

Other Articles