Mumbai Police warns of high tide ముంబైవాసులకు పోలీసుల వార్నింగ్..‘‘ఇళ్లను వదిలిరాకండీ..!’’

Mumbai police warns of high tide at 4 30 pm all schools closed

mumbai rains, mumbai weather, rains in mumbai, mumbai monsoon, mumbai rainfall, mumbai rain, water logging mumbai, weather in mumbai, colaba rain, andheri rain, malad rain, bombay rains, imd, imd satellite image, bombay, mumbai trains, mumbai, bombay, high tide, rains in Mumbai, Mumbai weather, Aditya thackeray, shivsena

High tide of 3.32mts at 16:30 Avoid waterfronts,sitting on tetrapods or on promenades. Pls cooperate with policemen on duty, appeals mumbai police through social media

ITEMVIDEOS: ముంబైని ముంచెత్తనున్న ఎత్తైన అల.. ప్రజల్లో దడ..

Posted: 08/29/2017 04:41 PM IST
Mumbai police warns of high tide at 4 30 pm all schools closed

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని ఎడతెరపి లేకుండా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైకర్లు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే ముంబైలోని అన్ని ప్రధాన ప్రాంతాలు నీటమునిగగా, సియోన్, ముంబై సెంట్రల్, అంధేరి, వార్లీ, సహా అన్ని ప్రాంతాల్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంబైకర్ల జీవనం.. గృహనిర్భంధాన్ని తలపిస్తుండగా, ఇక ఇవాళ సాయంత్రం భారీ ఎత్తు అలలతో ముంబైని ముంచెత్తే అవకాశాలు వున్నాయని వాతావారణ కేంద్రం అధికారుల అలర్ట్ లతో ముంబైవాసుల్లో దడ మొదలైంది.



రమారామి ఇళ్లలోంచి బయటకు వచ్చే సరిస్థితి లేకపోయినా.. కార్యలయాలకు వెళ్లక తప్పకపోవడంతో ముప్పుతిప్పలు పడుతూ.. విధులకు హాజరైన ముంబైకర్లు.. సాయంత్రం తరువాత భారీ అలలు ముంచెత్తుతాయని ఇటు వాతావరణ శాఖ అటు పోలీసులు అలర్ట్ చేయడంతో.. ముంబైవాసుల్లో అందోళన రేగుతుంది. ఇప్పటికే ముంబై పోలీసులు ప్రజలకు పలు విధాలుగా అప్పీలు చేశారు. వీరితో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బంది కూడా ముంబైవాసులను హెచ్చరించింది.

mumbai rains
అవసరమైన పనులు వుంటే తప్ప.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. సాయంత్రం ఐదున్నర గంటల తరువాత సముద్రతీరంలో భారీ ఎత్తు సుమారు మూడున్నర అడుగుల ఎత్తులో అలలు ఏర్పడే అవకాశాలు వున్నాయని. దీంతో సముద్రం నీరు ముంబై నగరంలోకి వచ్చే ప్రమాదముందని కూడా చెప్పారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాయంకాలనికన్నా ముందుగానే ఇళ్లకు చేరకునేందుకు అనుమతివ్వాలని ఆయా శాఖలకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.

2005 జూలై 26 నాటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేవని, అయితే ఏకధాటిగా వర్షం కురిసే అవకాశాలు మాత్రం కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు, అయితే 2005 జూలై తరువాత అంతస్థాయిలో వర్షం కురవడం.. భారీ వరదలతో భీతావాహ వాతావరణం మాత్రం ఇప్పుడు ఏర్పడిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ముంబై నగరంలోని రోడ్లు, వీధులు, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు, రైల్వే పట్టాలు, స్టేషన్లు నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలువడంతో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి.



భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే సాయంత్రం 4 గంటల తర్వాత భారీ అల ముంచెత్తే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ (బీఎంసీ), విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తమయ్యాయి. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నడుములోతు నీళ్లు నిలిచినట్టు, భవనాల్లోకి నీళ్లు వస్తున్నట్టు సమాచారం అందుతోంది. పలు ప్రభుత్వ ఆస్పతుల్లోనూ వరదనీరు వచ్చి చేరుతుండటంతో రోగుల పరిస్థితి దారుణంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai rains  high tide  rains in Mumbai  Mumbai weather  Aditya thackeray  shivsena  

Other Articles