WikiLeaks hints at Aadhaar database theft by CIA అమెరికా చేతిలో భారతీయుల ప్రాథమిక హక్కు

Wikileaks suggests cia may have access to india s aadhaar data

AADHAAR, wikileaks, Cross Match Technologies, CIA, aadhaar leak, UDAAI, indians perosnal information, AAdhar data leak, american intelligence service

WikiLeaks claimed to "expose" that CIA is using tools devised by US-based technology provider Cross Match Technologies for cyber spying that may have comprised Aadhaar data.

అమెరికా చేతిలో భారతీయుల ప్రాథమిక హక్కు

Posted: 08/26/2017 04:34 PM IST
Wikileaks suggests cia may have access to india s aadhaar data

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. పౌరల వ్యక్తిగత గోప్యత వారి ప్రాథమిక హక్కు అంటూ తీర్పును వెలువరించిన నేపథ్యంలో అంత్యంత సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత సురక్షితంగా వుందని చెప్పుకోచ్చిన ప్రభుత్వం వ్యాఖ్యలన్ని తప్పేనన్న కథనాలు జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. కేంద్రం చెప్పిన్న మాటలన్నీ మాటల్లోనే గాంబీర్యం తప్ప.. వాస్తవానికి అనేక డిల్లతనం వుందన్న విషయాన్ని ప్రముఖ సంస్థ వికీలీక్స్ ప్రకటించడంతో భారత్ వ్యాప్తంగా అందోళన రేకెత్తుతుంది. భారతీయులకు సంబంధించిన ఆధార్‌ డేటాబేస్ ను అమెరికా నిఘా సంస్థ తెలుసుకునే ప్రమాదముందని వికీలీక్స్‌ సంచలన ప్రకటన చేసింది.

అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీఐఏ) ఓ ప్రత్యేక టూల్ సాయంతో ఆధార్ డేటాను రహస్యంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని వికీలీక్స్ ఓ డాక్యుమెంట్ ను ప్రచురించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా డాక్యుమెంట్ లింక్ ను షేర్ చేసింది. ‘ఎక్స్‌ప్రెస్ లేన్ అనే టూల్ ను సీఐఏ ఉపయోగిస్తోంది. ఈ టూల్ ను అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ తయారు చేసింది. దీని సాయంతో క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కు అనుసంధానంగా ఉన్న సర్వీసుల నుంచి డేటాను రహస్యంగా తెలుసుకోవచ్చు’ అని వికీలీక్స్ డాక్యుమెంట్స్ లో పేర్కొంది.

భారత పౌరుల వివరాలను సేకరించేందుకు వినియోగించిన బయోమెట్రిక్ పరికరాలలో కొన్నింటిని క్రాస్ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ తయారు చేసింది. ఈ పరికరాలను ఆధార్ నమోదు కోసం ఉపయోగించినట్లు ఉడాయ్ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో వికీలీక్స్ డాక్యుమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక.. క్రాస్ మ్యాచ్‌ లాంటి కంపెనీల బ్యాగ్రౌండ్ ను చూసుకోకుండానే ఉడాయ్ వీటిని ధ్రువీకరించి ఉంటుంది అని వికీలీక్స్ డాక్యుమెంట్లలో పేర్కొంది. అంతేగాక రియల్‌ టైమ్ లో ఆధార్ డేటాబేస్ ను సీఏఐ తెలుసుకోవచ్చు అని సందేహం వ్యక్తం చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AADHAAR  wikileaks  Cross Match Technologies  CIA  aadhaar leak  UDAAI  

Other Articles