dharani nagar spills with thick toxic foam ధరణిని ముంచెత్తిన విష నురగ..

Toxic foam floods the streets of kukatpally s dharani nagar

pollution, polluted water, dharani nagar, thick toxic foam, pariki tank, chemically pollution, kukatpally, ghmc officials, telangana

pariki tank which filled with chemically pollution water aroses thick toxic foam covers entire dhanari nagar of kukatpally in ghmc limits of telangana.

ITEMVIDEOS: ధరణిని ముంచెత్తిన విష నురగ..

Posted: 08/26/2017 02:01 PM IST
Toxic foam floods the streets of kukatpally s dharani nagar

ధరణి అంబే భూమి.. అలాంటి భూమికి నిజంగా కష్టమెచ్చినా పాలకులకు పట్టదా..? అంటే పట్టదన్నట్లే వుంది. ఒకటి రెండు కాదు గత కొన్నేళ్లుగా ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతున్నా పాలకులు తాత్కాలికమైన చర్యలే తీసుకున్నారు తప్ప.. దానికి శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో ఎప్పుడు వనోచ్చినా.. ఎప్పుడు వరదలోచ్చినా.. అదను చూసుకుని కాలుష్యకార కంపెనీల తమ విషవాయువలను వదిలేయడంతో.. విషనురగలు ఏకంగా ధరణి నగర్ ముంచెత్తాయి. ఏకంగా మంచుకొండలను తలపిస్తున్న ఈ నురగలతో తాము సావాసం చేయలేమని స్థానికులు అవదేన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలో క్రితం రోజున కురిసిన భారీ వర్షానికి నగరవాసుల జీవనం అతలాకుతలమైంది. కూకట్‌పల్లి అల్విన్‌ కాలనీ, ధరణి నగర్ ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. ధరణి నగర్ లోని పరికి చెరువులో స్థానికంగా వుండే రసాయన పరిశ్రమలు వదిలిన కాలుష్య నిటీతో నిండిపోయింది. భారీ వర్షానికి ఈ నీళ్ల నుంచి రసాయన నురుగు వచ్చి ఇళ్లోలోకి చేరింది. ఈ నురగతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో స్థానికులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తెల్లగా, మంచు గుట్టలా పేరుకుపోయిన నురుగును తొలగించుకోవడానికి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. మంచు కొండలను తలపిస్తున్న నురగను చూసి స్థానికులు భయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం చుట్టు ప్రదిక్షిణలు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు అరోపిస్తున్నారు. కేవలం తాత్కలిక పరిస్కారాన్ని మాత్రమే చూపించిన అధికారులు ఎప్పటికప్పుడు తాము వెళ్లినా అదే పరిష్కారం చూపి జారుకుంన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pollution  polluted water  thick toxic foam  dharani nagar  kukatpally  ghmc officials  telangana  

Other Articles