అద్యాత్మిక గురువు ముసుగులో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం జరిపారన్న అభియోగాలు నిర్థారణ కావడంతో.. దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను హరియాణాలోని రోహ్ తక్ జైలుకు తరలించడం.. ఈ నేపథ్యంలో ఆయన శిష్యులు దేశరాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో విధ్వంసాలకు పాల్పడి.. అమాయకులైన 30 మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పోలీసులు పలు రాష్ట్రాల పోలీసులు, పూర్తిగా విఫలమయ్యారని కూడా అరోపణలు వస్తున్నాయి.
కాగా, దోషిగా తేలి రోహ్ తక్ జైలుకు తరలివెళ్లిన.. గుర్మీత్ సింగ్ కు జైలులో రాజభోగాలు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులైన వ్యక్తులే ఆయనకు భక్తులుగా వుండటంతో.. ఆయనకు జైలులో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సకల మర్యాదలు అందించాలని అదేశించిన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుర్మీత్‌కు ప్రత్యేక సెల్, మినరల్ వాటర్ బాటిల్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. ఆయనతో పాటు ఉండేందుకు ఒక అసిస్టెంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఓ వైపు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో రాజభోగాలను అనుభవిస్తున్నారని, అమెకు ప్రత్యేకంగా వంటగదిని కేటాయించారని, అందుకుగాను అమె నుంచి బెంగళూరు జైలుశాఖ అధికారులు రెండు కోట్ల మేర డబ్బును అందుకున్నారని అరోపణలు సంచలనం రేకెత్తించగా, ఇటు గుర్మిత్ సింగ్ కు కూడా ప్రభుత్వంలోని పెద్దల అండదండలే మెండుగా వుండి రాజమర్యాదలు అందుతున్నాయన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈ నెల 25న, సుమారు రెండు వందల కార్ల భారీ కాన్వాయ్ నడుమ ఆయనను పంచకుల కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణనానికి చేరుకున్న గుర్మీత్ వద్ద చాలా బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కన్పించింది. కోర్టు నుంచి రోహ్తక్ జైలుకు హెలికాప్టర్ లో తరలిచిన పోలీసులు రోహ్ తక్ వరకు తరలించి అ తర్వాత పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లారు.
పదిహేనేళ్ల క్రితం తన అశ్రమంలో చేరిన ఇద్దరు శిష్యురాళ్లపై కన్నేసిన ఈ కపట గురువు.. వారిపై అత్యాచారం చేసి.. ఏళ్ల పాటు వారు కనీసం ఆశ్రమం కూడా వదలివెళ్లకుండా వారిని నిర్భందించాడు. ఎట్టకేలకు ఈ దోంగబాబా ఆశ్రమం నుంచి తప్పించుకున్న ఇద్దరు మహిళలు పోలీసులను అశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసును తరువాత సిబిఐకి బదిలీ కాగా, విచారించిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ నెల 28న ఆయనకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. దీంతో మరోమారు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more