TET Qualification Compulsory For Private School Teachers ఇకపై ప్రైవేటు టీచర్లకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి..

Tet mandatory for private school teachers

Telangana State Public Service Commission, school education department, Telangana, Srinivas Reddy, hyderabad cracking, private schools, teachers, mandatory, teachers eligibilty test, tet qualified teachers, pvt school teachers

The Government of Telangana took the decision to make Teacher Eligibility Test (TET) mandatory for Private School Teachers. It is certainly to be implemented from the next academic year as per the orders from central government.

ఇకపై ప్రైవేటు టీచర్లకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి..

Posted: 08/24/2017 12:03 PM IST
Tet mandatory for private school teachers

భర్తలకు చాలీచాలని జీతాబెత్యాలు రావడంతో.. ఇంటి అద్దెలు, పిల్లల చదువులకే ఆ మొత్తం సరిపోతున్న తరుణంలో అనేక మంది సతులు.. వారి పతులకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు వారు చదువుకున్న చదువులను పరిగణలోకి తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా చేరిపోతున్నారు. ఈ మాదిరిగా రమారమి మధ్య తరగతి వర్గాల్లోని మహిళలందరూ కష్టపడుతుంటారు. అయితే ఇక ఇలాంటి టీచర్లను కూడా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇకపై ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే వారు కూడా తప్పనిసరిగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందేనన్న నిబంధనను కొత్తగా అమల్లోకి తీసుకువచ్చింది.  

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాల్సిందేనని కేంద్రం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధేశాలను పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన ప్రైవేటు టీచర్లలో చాలామంది టెట్ లో అర్హత సాధించారు. అయితే వారు ప్రభుత్వ ఉపాధ్యాయ టీచర్ల పోస్టుల కోసం చేపట్టే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా, బీఎడ్, డీఎడ్ అర్హతలు లేకుండానే టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు వెంటనే టీచర్ ట్రెయినింగ్ కోర్సులైన బీఎడ్, డీఎడ్ లను పూర్తిచేసేలా పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులలో పొందుపర్చారు. 2019 నాటికి ప్రైవేటు పాఠశాలలో బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారే ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించాలని.. ప్రస్తుతం అర్హతలు లేని వారు నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయాలని కేంద్రం అదేశాలలో తెలిపింది.

అయితే ఇలా బీఎడ్, డీఎడ్ కోర్సులను కూడా పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న శిక్షణ లేని టీచర్లకు తక్షణమే శిక్షణ ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.  శిక్షణ లేని టీచర్లకు వచ్చేనెలలో శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇంతవరకు బాగానే వున్నా కేంద్రం తాజా నిబంధనలపై ప్రైవేటు పాఠశాలల ఉపాద్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే వేతనాలకు ధీటుగా తమకు కూడా వేతనాలు కల్పించాలని ఆ తరువాత కొత్తగా నిబంధనలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles