Petrol and diesel on the Rise Post Daily Price Revisions

New twist in daily price revisions

Daily Price Revisions, Petrol Daily Price Revisions, Petrol Price Central Government, Dail Petrol Price Cheating

Union Government increase petrol price under daily price revisions. Almost 5 Rupees increased till now from June 16.

డెయిల్ పెట్రోల్ ధరలో కొత్త ట్విస్ట్

Posted: 08/24/2017 08:46 AM IST
New twist in daily price revisions

వినియోగదారులకు ఊరట ఇవ్వటమే ప్రధాన ఉద్దేశ్యం అంటూ కేంద్రం పెట్రోల్ ధరలపై రోజువారీ సమీక్ష విధానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రింద పెట్రోలు బంకుల్లో బులియన్ మార్కెట్ తరహాలో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆరంభంలో తగ్గించినట్లే తగ్గించి తర్వాత అసలు ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది.

మొదట్లో కేవలం పైసల్లో తగ్గించి గత నెల రోజుల్లోనే నాలుగు రూపాయల 36 పైసల వరకు పెంచింది. గతంలో 15 రోజుల కొకసారి పెట్రోల్ ధరల సమీక్ష విధానం అమలులో ఉండేది. దీంతో ప్రతి 15 రోజులకు ధరలు పెరిగినా తగ్గినా స్పష్టంగా తెలిసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్నటి ధరతో నేటి ధరను పోల్చి చూసే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో జూన్‌ 16న చివరిసారిగా పక్షంరోజుల సమీక్ష జరిగినప్పుడు లీటర్ పెట్రోలు ధర 71.57 రూపాయలు ఉండగా, లీటర్ డీజిల్‌ ధర 61.33 రూపాయలుగా ఉంది. అప్పటి నుంచి రోజూ ధరలు మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులై 1 నాటికి లీటర్ పెట్రోలు ధర 69.09 రూపాయలు ఉంది, లీటర్ డీజిల్‌ ధర 60.32 రూపాయలు ఉంది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 74.70 రూపాయలు ఉంది. లీటర్ డీజిల్ ధర 68.08 రూపాయలు.

దీంతో రోజు వారీ ధరల సమీక్ష పేరుతో కేవలం నెల రోజుల్లోనే ఏపీలో లీటర్ పెట్రోలుపై 5.61 రూపాయలు, లీటర్ డీజిల్‌ పై 3.76 రూపాయలు పెంచారు. ఏపీలో వ్యాట్ 4 రూపాయలు అదనంగా ఉండడంతో, తెలంగాణలో 1.9 రూపాయలు, డీజిల్ 1.76 రూపాయలు తక్కువగా ఉండడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Daily Price  Rate Increase  

Other Articles