scooterist fall in massive sink hole on road వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడితే...

Massive sinkhole opens up on guangxi road oblivious scooter rider falls right in

Beijing, cell phone, cell phone addiction, road, roads sinkhole, traffic, video watch, china, mobile, scooterist, scooter rider, guangxi road, facebook, social media, cctv footage, viral video

Massive sinkhole opens up on Guangxi road in china, oblivious scooter rider falls right in who was busy talking in mobile phone

ITEMVIDEOS: సెల్ ఫోన్ మాట్లాడితూ వాహనం నడిపితే...

Posted: 08/21/2017 12:46 PM IST
Massive sinkhole opens up on guangxi road oblivious scooter rider falls right in

అదో బిజీ రోడ్డు.. అయితే రాత్రి పూట కావడంతో కాస్తా ట్రాఫిక్ తగ్గింది. అకస్మాత్తుగా రోడ్డు కుచించుకుపోయి.. గొయ్యి ఏర్పడింది. అయితే.. రోజు వెళ్లే రహదారేగా.. బాగానే వుంటుందన్న ధీమాతో.. తన స్కూటర్ ను నడుపుతూ వెళ్తున్నాడు. రోడ్డు ఖాళీగా వుంది కదా.. అంటూ రయ్యిన వెళ్దామనుకునే సరికి అతని సెల్ ఫోన్ మోగింది. దీంతో సెల్ ఫోన్ మాట్లాడుతూనే వాహనాన్ని నడపసాగాడు. అదే అతని పాలిట అదృష్టంగా మారింది. అదెలా అంటే.. అతను నేరుగా అకస్మత్తుగా ఏర్పడిన గొయ్యిలో పడ్డాడు.

చైనాలోని గువాంగ్జీ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరా ఫూటేజీలో ఈ దృష్ట్యాలు నిక్షిప్తమయ్యాయి. అకస్మాత్తుగా ఏర్పడిన గొయ్యిని గమనించకుండా యువకుడు స‌రాస‌రి బండితో స‌హా గోతిలో ప‌డ్డాడు. అయితే తన వాహనాన్ని నెమ్మదిగానే నడుపుతున్నందున గొయ్యిలో పడిన యువకుడు తనకు తానుగానే లేచి గోయ్యి నుంచి బయటపడ్డాడు. రోడ్డు మార్గంలో వెళ్తున్న వారిని అప్రమత్తం చేస్తూ.. స్థానిక అధికారులకు సమాచారం అందించాడు.

స్థానికుల సాయంతో తన వాహనాన్ని కూడా బయటకు తీసిన యువకుడు.. స్వల్పగాయాలను చికిత్స నిమిత్తం వెళ్లాడు. ఈ ఫూటేజిని కాస్తా సోషల్ మీడియాలోకి పెఠ్టిన షాంగై అనే నెట్ జనుడికి లైకుల మీద లైకులు వస్తున్నాయి. యువకుడిది పునర్జన్మేనని కొందరు కామెంట్ చేయగా, సెల్ ఫోన్ వినియోగించకుండా వుంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నడిరోడ్డుపై 32 అడుగుల వెడ‌ల్పు, 6 అడుగుల లోతు ఉన్న ఈ గొయ్యి ఏర్ప‌డ‌టంతో సెల్ ఫోన్ లేనిపక్షంలో రోజు వెళ్లే దారే కదా అని మరింత వేగంగా వచ్చి ప్రమాదానికి గురై.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకునేవాడని మరికోందరు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cell phone  sinkhole  mobile  scooterist  guangxi road  facebook  social media  cctv footage  viral video  

Other Articles