Stage set for OPS faction merger into EPS Ruling party ఢిఫ్యూటీకి సై.. చేరికకు సై.. సై..

Stage set for ops faction merger into eps ruling party satisfies with dy cm

aiadmk, factions merger, AIADMK, T T V Dhinakaran, chief minister, Palaniswamy, O Panneerselvam, Tamil Nadu, BJP, PM Modi, SasiKala, Politics

The warring factions of the AIADMK may finally announce merger after Tamil Nadu Chief Minister K Palaniswamy agreed to the demands of his rival group leader O Panneerselvam.

ఢిఫ్యూటీకి సై.. చేరికకు సై.. సై.. తమిళనాట ఏకమవుతన్న భిన్న ధృవాలు..

Posted: 08/19/2017 08:05 PM IST
Stage set for ops faction merger into eps ruling party satisfies with dy cm

థ్రిల్లర్ సినిమాకు మించిన ట్విస్టులతో ఇటు తమిళవాసులతో పాటు అటు యావత్ దేశ ప్రజల అసక్తిని అకర్షిస్తున్న తమిళనాడు రాజకీయాలు ఇక చివరి అంకానికి చేరినట్లు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వమే ఈ మేరకు సంకేతాలను ఇచ్చారు. మరికోన్ని రోజుల్లో శుభవార్లను చెబుతానని ఆయన స్వయంగా మీడియాతో చెప్పారు. దీంతో అమ్మ మరణంతో ఉప్పు-నీప్పులా మారిన రెండు వర్గాలు.. ఇక పప్పు-ఉప్పులా కలిసిపోనున్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామి ఒక్కటవుతున్నట్లు జరిగిన ప్రచారానికి ఇక ముగింపుకు చేరింది. తన డిమాండ్లపై ఎంతో పట్టుదలగా వున్న పన్నీరు.. ముఖ్యమంత్రి పళని స్వామితో వున్న విభేదాలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నారు.

తమిళనాడు అమ్మ జయలలిత పదవికి దూరమైన సమయంలో తానే ముఖ్యమంత్రిగా వ్యవహరించినా.. అమె మరణించిన తరువాత మాత్రం ఆ పదవి అందిఅందినంత త్వరగానే దూరమయ్యింది. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినా.. అది దక్కకపోవడంతో.. మార్చిన వ్యూహం నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవితో పన్నీరు సెల్వం సరిపెట్టుకోవాల్సి వస్తున్నా.. అందుకు సమ్మతించి ఆయన అధికార పార్టీతో తన వర్గాన్ని విలీనం చేసేందుకు సమ్మతించారు.

ఈ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్ంయలో జైలులో వున్న   శశికళ, తన పట్టును నిలుపుకునేందుకు అక్కడి నుంచే తన వర్గం నేతలకు సలహా, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా తొలగిస్తున్నట్టు ప్రకటించిన తరువాతనే విలీనం విషయమై తుది ప్రకటన చేస్తానని పన్నీర్ సెల్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ఇటీవలే అమ్మ మృతిపై రిటైర్డు జడ్జితో విచారణకు అదేశించిన ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం.. ఇక త్వరలో ఈ మేరకు కూడా నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.

తనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, తన వర్గంలోని ఎమ్మెల్యేలకు కనీసం మూడు నుంచి నాలుగు మంత్రి పదవులను ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఓ శుభవార్త చెబుతానని పన్నీర్ సెల్వం స్వయంగా ప్రకటించారు. పళనిస్వామితో చర్చించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని వేశామని, ఈ కమిటీ చర్చలు సాగిస్తుందని ఆయన తెలిపారు. కీలకాంశాల్లో ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత రెండు వర్గాలూ విలీనం అవుతాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles