pakistan girl carries goddess saraswati idol సరస్వతీ దేవి విగ్రహాన్ని పాక్ యువతి ఎందుకు తీసుకెళ్లింది..?

Girl from pakistan returns home with goddess saraswati for her friend

pakistan girl returns home with goddess saraswati idol, goddess saraswati idol, Tuba Fatima, Hindu friend, Ritu, Madhya Pradesh, Tuba Fatima, Karachi resident, Pakistani Girl, Saraswati idol

Showcasing a unique bond of Hindu-Muslim friendship, a girl from Pakistan is returning to her country with a memorable gift for her friend – the idol of the goddess of wisdom and knowledge, Saraswati.

సరస్వతీ దేవి విగ్రహాన్ని పాక్ యువతి ఎందుకు తీసుకెళ్లింది..?

Posted: 08/17/2017 11:00 AM IST
Girl from pakistan returns home with goddess saraswati for her friend

అనునిత్యం భారత సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూ.. కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని పెంచిపోషిస్తున్న దాయాధి దేశంలో మాత్రం భారత్ అంటే చాలా ఇష్టమని, అసలు భారత్ పై వారికెలాంటి అయిష్టత, వ్యతిరేక భావం లేదన్నది ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ధన్యవాదాలు చెబుతూ ఓ పాకిస్తాన్ మహిళ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పాకిస్తాన్ వాసుల్లో కూడా అమితమైన సర్వమత సౌభ్రాభృత్వం పరడవిల్లుతుందని మరో ఘటన నిరూపించింది.

నెల రోజుల క్రితం భారత్ లోని మధ్యప్రదేశ్ లో నివసిస్తున్న తమ మామయ్య ఇంటికి వచ్చిన పాకిస్తాన్ ముస్లిం యువతి.. తన సొంత దేశానికి తిరిగి వెళ్తూ.. చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని తీసుకెళ్లింది. అదేంటి ముస్లిం యువతికి సరస్వతి విగ్రహాం ఎందుకంటారా..? తాను భారత్ లో వున్నానని, నెల రోజుల పాటు ఇక్కడ తన మామయ్య ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో అమె పాకిస్థాన్ లో వున్న తన ప్రియమైన స్నేహితురాలు రీతూకు ఫోన్ చేసి తాను పాకిస్థాన్ వస్తున్నానని, అయితే భారత్ నుంచి నీకు ఏం తీసుకురావాలి అని అడిగింది.

అవతని నుంచి రీతూ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి బహుమతులు వద్దని, అయితే సాథ్యం అయితే మాత్రం చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకురావాల్సిందిగా కోరింది. అమె అలా చెప్పండంతో ఏకంగా తమ మామయ్యను వెంటబెట్టుకుని హార్డాలోని హిందూ దేవతా విగ్రహాలను విక్రయించే దుకాణాల్లో తిరిగి మొత్తానికి సరస్వతీ విగ్రహాన్ని తీసుకెళ్లింది. ఇంతకీ ఆ పాకిస్థాన్ ముస్లిం యువతి పేరేంటో తెలుసా.. తుబా ఫాతిమా.. పాకిస్తాన్ కరాచీకి చెందిన 21 ఏళ్ల యువతి తన హిందూ స్నేహితురాలి కోసమే సరస్వతీ దేవి విగ్రహాన్ని కొనుగోలు చేసి అత్యంత పవిత్రంగా పాకిస్థాన్ కు తీసుకెళ్లింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఫాతిమా..  రీతూ, తాను ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్టు పేర్కొంది. అమె తనకు అత్యంత ప్రియమైన స్నేహితురాలని.. రెండు కుటుంబాల మధ్య విడదీయరానంత సాన్నిహిత్యం ఉందని పేర్కొంది. గతేడాది తన తల్లి భారత్ వచ్చినప్పుడు రీతు కోసం గణేశుడి విగ్రహం తెచ్చిందని, ఇప్పుడు తాను సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆమెకు బహుమానంగా ఇస్తున్నట్టు ఆనందంగా తెలిపింది. ఫాతిమా మేనమామ అహద్ ఖాన్ మాట్లాడుతూ.. తన మేనకోడులు తనకు సరస్వతి విగ్రహం కావాలని కోరిందని, అందుకోసం దుకాణాల్లో వెతికి చివరకు తీసుకున్నామని, దీనిని అక్కడ తన హిందూ స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడం సంతోషకరమని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Tuba Fatima  Ritu  Hindu friend  Karachi resident  Pakistani Girl  Saraswati idol  

Other Articles