బోరు బావిలోంచి నవ్వుతూ బయటికొచ్చాడు | NDRF team rescues boy stuck in Borewell

Boy rescued from borewell in guntur

Borewell, Borewell Boy, Borewell Boy Rescue, Vinukonda Guntur Borewell, NDRF TEam Chandrashekar Boy, Two Years old Boy Rescue, Borewell Boy Rescue

Two Years old Boy Chandra Shekar rescued safely from borewell in Vinukonda Guntur. NDRF Team Rescue operation continue 11 hours for that trapped boy.

ITEMVIDEOS:బోరుబావిలో బాలుడు.. సేఫ్

Posted: 08/16/2017 08:40 AM IST
Boy rescued from borewell in guntur

రెండేళ్ల బాలుడి చేతిలో మృత్యువు ఓడిపోయింది. సుమారు 11 గంటల పాటు అధికారులు జరిపిన ఆపరేషన్ విజయవంతం కావటంతో బోరుబావి నుంచి చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున 2:40 గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం, ఉమ్మడివరం గ్రామంలో మంగళవారం చంద్రశేఖర్ అనే బాలుడు బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే.

తొలుత బాలుడిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి కోసం రంగంలోకి దిగారు. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతున మరో గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు.సజీవంగా బయటకు వచ్చిన బాలుడిని చూసిన తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

 

గ్రామానికి చెందిన అనూష, మల్లికార్జున కుమారుడైన చంద్రశేఖర్ పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. లోపలున్న బాలుడికి నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. మరోవైపు బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. మధ్యలో సున్నపురాయి తగలడంతో సహాయక చర్యలకు కొంత ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల సమయంలో వర్షం మరోమారు ఆటంకం కలిగించింది. అయినా సహాయక చర్యలు ఆపలేదు. చివరికి చిరునవ్వుతో బయటికి రావటంతో ప్రతీ ఒక్కరూ సంతోషంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guntur  Vinukonda  Borewell Invident  Rescue Operation  

Other Articles