Sisters set ablaze in sleep, teen hints at stalker role ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం. నిద్రిస్తున్న అక్కచెల్లెళ్లపై..

Bareilly teenage girls set ablaze police suspect role of stalker

teenagers set on fire, Bareilly, Girls Set Ablaze, Stalking, Harassment, sisters set ablaze, Kumar Autowheels Pvt Ltd, Teenage sisters, Jogendra Kumar, engulfed in flames. bairelly, assailant struck, crime

Two teenage sisters were set on fire by an unidentified assailant while asleep at home in Bareilly early on Friday morning, with the elder sister, 19, sustaining 95% burns. The younger girl, 17, suff ered 60% burns.

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం. నిద్రిస్తున్న అక్కచెల్లెళ్లపై..

Posted: 08/12/2017 10:33 AM IST
Bareilly teenage girls set ablaze police suspect role of stalker

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న ఇద్దరు యుక్త వయస్సు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని అగంతకులు హతమార్చేందుకు యత్నించారు. వారిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాళ్ల అరుపులు, కేకలు విన్న కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన అగంతకుల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లా నవాబ్ గంజ్ ప్రాంతంలో జరిగిందీ ఘోరం. శుక్రవారం రాత్రి కొందరు దుండగులు తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోనికి ప్రవేశించారు. నిద్రపోతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలకు వారు లేచి చూసేసరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారు. 18 యేళ్ల గుల్షాన్ పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమె చెల్లెలు ఫిజా(17)కు 40 శాతం కాలిగాయాలయ్యాయి.
 
ఈ సంఘటనపై ఫిజా మాట్లాడుతూ... ‘‘ నిందితులు ఎవరో, ఎందుకు వచ్చారో మాకు తెలియదు. ఎవరితోనూ మాకు గొడవలు లేవు. రాత్రిపూట ఒకే మంచంపై నిద్రిస్తున్న మా ఇద్దరికీ నిప్పంటించారు. నేను లేచి వారి ముఖాలు చూసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పారిపోయారు...’’ అని వెల్లడించింది. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  muslims  sisters  set ablaze  Goons Attack  Bareilly  Girls Set Ablaze  Stalking  Harassment  crime  

Other Articles