Ahmed Patel makes it to Rajya Sabha కమలం కోటలో రెపరెపలాడిన కాంగ్రెస్

After midnight drama congress leader ahmed patel wins rajya sabha

Ahmed Patel, Congress in Gujarat election, Rajya Sabha election Gujarat, Gujarat Rajya Sabha election, NCP, Rajya Sabha election, Ahmad Patel, Rajya Sabha‬, ‪Gujarat‬, ‪Ahmed Patel‬‬, Amit Shah, Smriti Irani, Congress, Election Commission, Indian National Congress, Gujarat RS Polls

Congress president Sonia Gandhi's political secretary Ahmed Patel was re-elected to the Rajya Sabha for a fifth term in an election that had put him under pressure but he did not blink.

అర్థరాత్రి హైడ్రామా మధ్య అహ్మద్ పటేల్ గెలుపు

Posted: 08/09/2017 07:44 AM IST
After midnight drama congress leader ahmed patel wins rajya sabha

గుజరాత్‌ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హైవోల్టేజీ సస్పెన్స్ డ్రామా అర్థరాత్రి వరకు కొనసాగాయి. పలుమార్లు లెక్కింపు ప్రక్రియ అగిపోయిన  తరువాత ఎట్టకేలకు అర్థరాత్రి ఎలాంటి విఘ్నాలు లేకుండ కౌంటింగ్ సాగిన అనంతరం కమలం కోటలో కాంగ్రెస్ రెపరెపలాడింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తూ సాగిన ఈ ఎన్నికలలో బీజేపి నుంచి జాతీయ అథ్యక్షుడు అమిత్ షా. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు కూడా విజయం సాధించారు.

గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినా లెక్కింపు ప్రక్రియకు వచ్చేసరికి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ విజయం సాధించినట్లు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అనధికారికంగా వెల్లడయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో ప్రకటించింది. పటేల్‌ కూడా ట్విటర్‌ ద్వారా తన విజయాన్ని పంచుకున్నారు. సత్యమేమ జయతే అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి తన విజయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు క్రాస్‌ ఓటింగుకు పాల్పడిన దృష్ట్యా వారి ఓట్లను రద్దు చేయాలని కాంగ్రెస్‌ చేసిన డిమాండుతో లెక్కింపు ప్రక్రియకు అవరోధం ఎదురయింది. ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా దాదాపు అర్థరాత్రి సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయూష్‌ గోయల్‌ తదితరుల బృందం ఎన్నికల సంఘాన్ని మూడుసార్లు కలిసింది. బీజేపి బృంధం కలసి వెళ్లిన తరువాత మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం నేతృత్వంలో ఒక బృందం వెళ్లి ఎన్నికల అధికారుల్ని కలసింది. ఆ తరువాత ఎన్నికల సంఘంం తన నిర్ణయాన్ని ప్రకటించింది. క్రాస్ ఓటింగ్ వేసిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యలు ఓట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపి శిబిరంలో అప్పటి వరకు వున్న అనందోత్సాహాలు ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. అయితే ఈ నిర్ణయంతో తీవ్ర ఉత్కంఠకు గురైన కాంగ్రెస్ శ్రేణుల శిబిరాల్లో అనందోత్సాహాలు వెల్లివిరిసాయి. తీవ్ర తర్జనభర్జనల తర్వాత, వీడియో దృశ్యాలను చూసిన మీదట ఈసీ తన నిర్ణయాన్ని వెలువరిస్తూ రెండు ఓట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విజయానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 45 నుంచి 44కి తగ్గినట్లయింది. అమిత్‌షా, స్మృతి ఇరానీలకు 46 చొప్పున ఓట్లు సాధించగా, అహ్మద్ పటేల్ 44 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుని విజయం సాధించారు. కాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడిని రగిల్చింది. కాగా అహ్మద్ పటేల్ ఐదవ సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmed Patel  Rajya Sabha elections  Smriti Irani  Amit Shah  Gandhinagar  Gujarat  

Other Articles