ATM expansion slows due to note ban గణనీయంగా తగ్గిన ఏటీయం కేంద్రాల ఏర్పాటు..

Atm expansion slows due to note ban

atm centers, cash crunch, demonetisation, atm expansion, off site atms, on site atm centers, reserve bank, state bank of india, bhartiya mahila bank, economy

demonetisation of high value notes have led to commercial banks cutting down on the number of ATMs particularly those not located in branches (off-site ATMs), latest RBI data showed.

గణనీయంగా తగ్గిన ఏటీయం కేంద్రాల ఏర్పాటు..

Posted: 08/07/2017 07:11 PM IST
Atm expansion slows due to note ban

దేశంలో అవినీతి నిర్మూలణ, నల్లదన ఏరివేత, నకలీ నోట్ల అటకట్టు తదితర కారణాలను చూసిన పాత పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం.. ఆ తరువాత తాజాగా అప్ సైట్ ఏటీయంల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించేందుకు సిద్దం అవుతుందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అందుకు తాజాగా వెల్లడైన గణంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాల పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఏటీయంలలో డబ్బులు లేక వినియోగదారాలకు నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూ స్వాగతం పలికిన సందర్భాలను అంతత్వరగా మర్చిపోలేదు.

అయితే ఆ తరువాత కూడా ఇప్పటి వరకు క్యాస్ ను విధిల్చుతున్న ఏటీయంల  సంఖ్య తగ్గిపోయింది. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన నగదు కొరత ఇతర కారణాలతో బ్యాంకులు తమ ఏటీఎంల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా బ్యాంకు ఆవరణలో(ఆన్‌సైట్‌) ఉండే ఏటీఎంలతో పోల్చితే ఇతర ప్రదేశాల్లో(ఆఫ్‌ సైట్‌) ఉండే ATMల సంఖ్య తగ్గింది. భారతీయ రిజ్వరు బ్యాంకు లెక్కల ప్రకారం జూన్‌ 2017 వరకు ఆఫ్‌ సైట్‌ ఏటీయం కేంద్రాల సంఖ్య 98,092గా ఉంది. గతేడాదిలో ఇదే సంఖ్య 99,989గా నమోదైంది.

అయితే ఇదే సమయంలో ఆన్‌సైట్‌ ఏటీఎం కేంద్రాల సంఖ్య మాత్రం నామమాత్రంగా పెరగింది. గతేడాది 1,01,346గా ఉన్న వీటి సంఖ్య ఈ ఏడాది 1,10,385కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా జూన్‌ 2016 నుంచి జూన్‌ 2017 వరకు తీసుకువచ్చిన కొత్త ఏటీఎంల సంఖ్య దాదాపు 7వేలుండగా.. అంతకుముందు ఏడాది సుమారు 16 వేల ATMలను కొత్తగా తీసుకువచ్చారు. అయితే ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీయం కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు స్టేట్ బ్యాకుల విలీనమే కారణమన్నది జగమెరిగిన సత్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles