AAP MLA Surendra Singh sent to judicial custody అప్ ఎమ్మెల్యేకు అరదండాలు..

Defacement case aap mla surendra singh sent to judicial custody till aug 17

MLA 'Commando' Surendra Singh, MLA Surendra Singh, aap mla arrest, aap mla surendra singh, aap mla, surendra singh, arrest, judicial custody, defacement, public property, ashu garg, Aam Aadmi Party, Patiala House Court, Additional Chief Metropolitan Magistrate, Law_Crime, Politics, crime

The Patiala House Court ordered to take Aam Aadmi Party (AAP) MLA 'Commando' Surendra Singh into judicial custody till August 17 in an alleged case of defacing of public property in 2014

అప్ ఎమ్మెల్యేకు అరదండాలు..

Posted: 08/05/2017 05:54 PM IST
Defacement case aap mla surendra singh sent to judicial custody till aug 17

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వానికి పటియాల కొర్టులో మరో షాక్ ఎదురైంది. ప్రభుత్వంలోని ఓ మరో అప్ ఎమ్మెల్యేకు న్యాయస్థానం అరదండాలు వేయించింది. కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఆప్‌ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఆయనపై గతంలో నమోదైన కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యేకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చాగా కోర్టు ఆయనను ఈ నెల 17 వరకు కటకటా వెనక్కి పంపింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తున్నారంటూ 2014లో అప్ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్ పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆయన పదే పదే కోర్టులో నోటీసులను నిర్లక్షం చేస్తూ.. విచారణకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అదేశాల మేరకు పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పటియాలా న్యాయస్థానంలో హాజరు పరచగా.. అడిషనల్  చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అషు గర్గ్.. సురేందర్ సింగ్ కు ఈ నెల 17 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

వాయ్యువ్య ఢిల్లీలోని నారైనా ప్రాంతంలో గల ప్రభుత్వ కార్యాలయాలు, అఫీసుల వద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తూ.. పోస్టర్లు అతికిస్తూ ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తున్నారంటూ ఆ ప్రాంత వాసులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదూంది. అయితే అంతకుముందు నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌ వివాదంలోనూ సురేంద్ర సింగ్‌ వార్తల్లోకెక్కారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న డిగ్రీ సర్టిఫికేట్‌ నకిలీదంటూ బీజేపి నేత కరణ్‌సింగ్‌ తన్వార్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap mla  surendra singh  arrest  judicial custody  defacement  public property  ashu garg  crime  

Other Articles