Bangladesh 'porn kingpin' Fuad Bin Sultan remanded ఎట్టకేలకు అశ్లీల సుల్తాన్ అరెస్టు..

Sultan of sex films intimacy with over 150 married women

Faud bin Sultan, ‘Sultan of Sex’, Bangladesh police, Ishtiaque Ahmed, Spokesperson, pornographic videos, intimate videos, married women, blackmail, crime

A man identified as Faud bin Sultan, aka ‘Sultan of Sex’ has been arrested for filming sexual intercourse with over 150 women, mostly married women, and blackmailing them for money afterwards.

ఎట్టకేలకు అశ్లీల సుల్తాన్ అరెస్టు.. 150 వీడియోలు స్వాధీనం

Posted: 08/04/2017 12:55 PM IST
Sultan of sex films intimacy with over 150 married women

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది వివాహితలతో లైంగిక సంబంధం ఏర్పర్చుకుని వారిని డబ్బులివ్వాలని వేధింపులకు గురిచేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మదమృగాన్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తనను తాను ‘సుల్తాన్‌ ఆఫ్‌ సెక్స్‌’ గా అభివర్ణించుకుంటూ 150 మందికిపైగా మహిళల జీవితాలతో ఆటలాడుతున్న కామాంధుడిపై పోలీసులకు విపరీతంగా పిర్యాదులు అందడంతో వాడిని అదుపులోకి తీసుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అతని ఇంట్లో మాదకద్రవ్యాలు కూడా వుండటంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

గడిచిన కొద్ది నెలలుగా సూపర్‌ హీరోల మాస్క్‌లు ధరించిన ఒకడు.. ఇంటర్నెట్‌లో అసభ్య వీడియోలను పోస్ట్‌ చేస్తున్నాడు. తనను తాను సెక్స్‌ సుల్తాన్‌గా అభివర్ణించుకున్న వీడి అసలు పేరు ఫౌద్‌ బిన్‌ సుల్తాన్‌. బంగ్లాదేశ్ లోని ఢాకా కేంద్రంగా రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. వీడు పోస్టు చేసిన వీడియోలు బంగ్లాదేశ్ వ్యాప్తంగా హల్ చల్ చేయడం.. అదే సమయంలో వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న పిర్యాదులు కూడా అధికమయ్యాయి. ఇక వీడి అశ్లీల వీడియోల​కు యువత, చిన్నపిల్లల్ని కూడా చెడొగొట్టేస్తున్నాయి. దీంతో సుల్తాన్ అప్ సెక్స్ పేరు కూడా వైరల్ అయ్యింది. వాడికి డబ్బివ్వని వివాహితల వీడియోలను వాడు క్రక్రమంగా నెట్ లో పెట్టడంతో వాడితో పాటు వాడి వీడియోలు కూడా చర్చనీయాంశంగా మారాయి.  

పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఇష్తియాఖీ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫౌద్ బిన్ సుల్తాన్ చేతిలో సుమారుగా 150 మంది వివాహితలు చిక్కుకున్నారని తెలిపారు. వారిని లోబర్చుకున్న సుల్తాన్ వారి అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడని కూడా తెలిపారు. నిందితుడిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు చాకచక్యంగా వలపన్ని నిందితుడిని పట్టుకున్నారని ఇఫ్తియాజ్ అహ్మద్ తెలిపారు. ఢాకాలోని సుల్తాన్‌ ఇంట్లోని ల్యాప్‌టాప్‌ నిండా అశ్లీల వీడియోలు వున్నాయని గుర్తించారు పోలీసులు. ఈ మదమృగంపై నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశముందని ఇష్తియాఖీ అహ్మద్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Faud bin Sultan  ‘Sultan of Sex’  Bangladesh police  Ishtiaque Ahmed  porn videos  crime  

Other Articles