Congress Protest: Opens ‘State Bank Of Tomato’ కాంగ్రెస్ వారి స్టేటు బ్యాంకు అప్ టొమాటో

Congress party stages protest against soaring tomato prices

tomatoes prices, state bank of tomato, state bank of tomato congress protest lucknow, state bank of tomato for tomato prices, what is state bank of tomato, rising tomato prices in india, tomato prices in india, congress opens state bank of tomato, state bank of tomato, bank, congress, prices, protest, tomato

With tomato prices going high, Congress party protests against center by opening a bank named ‘State Bank of Tomato’. People can deposit, withdraw and safe-keep their tomatoes.

ఈ బ్యాంకులో టొమాటోలను మాత్రమే డిఫాజిట్ చేస్తారు..

Posted: 08/03/2017 09:06 PM IST
Congress party stages protest against soaring tomato prices

సామాన్యుల అపిల్ పండుగా పిలిచే టామాటాల ధరలు అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి. నిత్యవాసర సరుకుల ధరలను సామాన్యులకు అందుబాటులో వుంచే విధంగా చేస్తామని, వాటి ధరలపై ఎప్పటికప్పుడు పరిశీలించి..చెక్ పెడతామని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయినట్లుంది. కేజీ టామాటా ధర ఏకంగా రూ.120 వరకు వెళ్లగా.. వాటిని అందుకునేందుకు సామాన్యులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. పెరట్లో పెంచుకోదగిన ఈ టామాటాలకు ఇప్పడు వచ్చిన గిరాకీ వింటే.. నిర్థాంతపోకతప్పదు.

కొందరు పనిగట్టుకుని మార్కెట్లకు వెళ్లి టామాలోలను చౌర్యం చేస్తున్నారుని చెప్పినా అతిశయోక్తి కాదు. ఓ వైపు రైతులకు మాత్రం వారి సరుకుకు ధర రాక లబోదిబో మంటుంటే.. వినియోగదారులు మాత్రం ధరాఘాతంలో బెంబేలెత్తిపోతున్నారు. అయితే మధ్యనున్న దళారీలు మాత్రం లాభాలను అప్పన్నంగా మేసేస్తున్నారు. అయినా కేంద్రం మాత్రం ధరలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టనట్టు వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

దాంతో మండుతున్న టొమాటో ధరలకు నిరసనగా పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్ నవూలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి నిరసనను వ్యక్తం చేశారు. సాధారణ బ్యాంకుల్లో లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంక్‌లో టొమాటోలను రుణాలుగా ఇస్తున్నారు. విషయం తెలిసి కస్టమర్లు బ్యాంకుకు బారులుతీరారు. ఇందులో తమ వద్ద ఉన్న టొమాటోలు డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల తర్వాత రెట్టింపు మొత్తంలో టొమాటోలు వస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లు మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ‘నేను ప్రస్తుతం అర కేజీ టొమాటోలు డిపాజిట్‌ చేశారు. ఆరు నెలల తర్వాత కేజీ టొమాటోలు పొందుతాను’ అని 103 ఏళ్ల ఓ వృద్ధుడు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bank of tomato  bank  congress  prices  protest  tomato  lucknow  chandigarh  

Other Articles