brother kills sister for having extra-marital affair మనషేలా వీళ్లు.. సాయాన్ని అర్థిస్తున్నా పట్టించుకోరా..?

Man kills sister and her lover for having extra marital affair

brother kills sister for having extra-marital affair, Digambar Baburao Dasari, sister, sister pooja jethiba varashewar, lover, govind vitthal karhale, mullah, divshi village, bhokar, tehsil, telangana state, maharastra lovers, extra marital affiar, crime

An enraged brother Digambar Baburao Dasari, murdered his sister Pooja Jethiba Varashewar (22) and her lover Govind Vitthal Karhale (25) using a cycle. The bodies were found in a nullah between Divshi village in Bhokar tehsil and Telangana state.

అక్క ప్రేమపై కత్తిగట్టిన తమ్ముడు.. దయలేని స్థానికులు..

Posted: 08/02/2017 06:27 PM IST
Man kills sister and her lover for having extra marital affair

అవును నిజంగానే మనిషనేడు మాయమైపోతున్నాడు. అందివచ్చిన సాంకేతిక విప్లవం నేపథ్యంలో సోషల్ మీడియాకు దెగ్గరవుతున్న మనిషి.. సాటి మనిషి పట్ల మాత్రం కనీసం మానవత్వాన్ని ప్రదర్శించడం లేదు. నడిరోడ్డుపై ఒక యువతి తనకు సాయం చేయాలని అర్థిస్తున్నా.. అక్కడున్న వాళ్లలో ఒక్కరు కూడా సాయం అందించలేదు. కేవలం వేడుకను చూస్తూ వుండిపోయాయి. గొంతు తెగి రక్తమోడుతున్న యువతిని అమె వివరాలు తెలుసుకునేందుకు కొందరు అసక్తి చూసారే తప్ప.. సాయం మాత్రం అందించలేదు.

ఇక మరికొందరు మాత్రం బాధితురాలు ఎలా భాదపడుతుందన్న వైనాన్ని తమ సెల్ ఫోన్లలలో చిత్రీకరించడంలో బిజిగా వున్నారు. అమె అనుభవిస్తున్న భాధను, ఉభికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని సాయం చేస్తారని ఎదురుచూస్తున్న నిరీక్షణను అర్థం చేసుకోలేని వారు కూడా మనుషల జాబితాలోకి వస్తారా..? వీళ్లకు ఓటర్ కార్డులు, అధార్ కార్డులు, సెల్ ఫోన్లు అవసరమా..? మచ్చకైన మానవత్వంతో వ్యవహరించి బాధితురాలని అస్పత్రికి తరలించేందుకు ధైర్యం చేయని వీళ్లు మనుషలేనా.. వీళ్లకు మనస్సనేది వుందా..? అన్న అనుమానాలు రాక తప్పవు. సాయం కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురుచూస్తు నీరిక్షించిన అమె.. అలా ఎదరుచూస్తూనే అనంతవాయువులలో కలసిపోయింది
 
ఈ ఘటన పది రోజుల క్రితం నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో జరిగింది. మహారాష్ట్ర భోకర్ తాలుకా కేర్బాన్ గ్రామంలోని పూజ అనే 21 ఏళ్ల యువతి తమ ఇంటి పక్కనుండే గోవింద్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే బిసి కులంలో పుట్టి.. దళితుడ్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిన పూజ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే నెల తర్వాత పుట్టింటికి వచ్చిన పూజ.. గోవింద్ తో కలసి బతికేందుకు ఇష్టపడి.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఇంతలో పూజ తమ్ముడు దిగంబర్ పూజకు ఫోన్ చేసి..తిరిగి వస్తే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తామని నమ్మించాడు.
 
అది నమ్మిన పూజ తాము నిగ్వా వైపు వెళుతున్నామని చెప్పింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న దిగంబర్..  పూజ, గోవింద్‌లపై కత్తితో విరుచుకు పడ్డాడు. ఈ దాడిలో గోవింద్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పూజను ఏకంగా గొంతు కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ పూజ రోడ్డుపై పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన దిగంబర్ అక్కడి నుంచి పారిపోయాడు. అలా రోడ్డుపై పడి ఉన్న పూజ రెండు గంటల పాటు ప్రాణాల కోసం అల్లాడిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు చిన్న సాయం కూడా అందించలేదు సరికదా ఆమె చనిపోతున్న తీరును ప్రతిక్షణం వీడియో తీసి ఆనందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digambar Baburao  pooja jethiba  lover  govind vitthal  mullah  divshi village  bhokar  telangana  crime  

Other Articles

Today on Telugu Wishesh