Google denies hiring Class 12 boy at high package ఇంటర్ విద్యార్థికి గూగుల్ ఉద్యోగం..! అంతా తూచ్..!!

Google denies hiring 16 year old class 12 boy at 1 4 crore package

Google denies hiring Class 12 boy, google, chandigarh, icon designing, usa, harshit sharma, graphic designing, Director, School Education, Government Model Senior Secondary School, Deep Kiran, Indra beniwal, high package

The 16-year-old boy, Harshit Sharma was heard to have bagged a job at Google for icon designing. But Google has denied the claims.

ఇంటర్ విద్యార్థికి గూగుల్ ఉద్యోగం..! అంతా తూచ్..!!

Posted: 08/02/2017 04:42 PM IST
Google denies hiring 16 year old class 12 boy at 1 4 crore package

ఇంటర్ చదవుతున్న విద్యార్థికి గూగుల్ కంపెనీలో భారీ ప్యాకేజీలో ఉద్యోగం లభించిందన్న వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని మాత్రం గూగుల్ సంస్థ ధృవీకరించడం లేదు. రూ.1.44 కోట్ల వార్షిక వేతనంతో తాము ఓ ఇంటర్ విద్యార్థికి ఉద్యోగం కల్పించామన్న వార్తను గూగుల్ తోసిపుచ్చింది. ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో.. తమ రికార్డులను పరిశీలించుకున్న తరువాత గూగుల్ సంస్థ ఈ విషయమై స్పందించింది. హర్షిత్ శర్మ అనే 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని తమ సంస్థ ఉద్యోగం అందించినట్లు తమ రికార్డులలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రికార్డులను పరిశీలించిన తరువాతే తాము ఈ విషయాన్ని చెబుతున్నామని తెలిపింది.

ఇంటర్ విద్యతోనే అరుదైన ఘనత సాధించాడంటూ హర్షిత్ శర్మపై నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్న వేళ.. గూగుల్ కంపెనీ ప్రతినిధులు ఈ విషయమై మాట్లాడుతూ హర్షిత్ శర్మకు ఉద్యోగ నియామకానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది. అయితే భారతీయ విద్యార్థులకు గూగుల్ కూడా అన్యాయం చేస్తుందా అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇంతకీ ఏం జరిగిందీ..? ఎక్కడ పొరబాటు చోటుచేసుకుందని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ ప్రచారానికి మూల కారణం మాత్రం పాఠశాల యాజమాన్యమేనని తెలుస్తుంది. 18 ఏళ్ల లోపు బాలబాలికలను ఉద్యోగంలో పెట్టకుంటే భారతీయ చట్టాల ప్రకారం నేరమని తెలిసి కూడా పాఠశాల ఇంత విపరీత ప్రచారానికి ఎందుకు వెళ్లిందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే గూగుల్ హర్షిత్ శర్మకు సంబంధించిన సమాచారం లేదని అంటుందా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
 
ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ ఇంద్రా బెనివాల్ స్పందిస్తూ ఈ సంవత్సరం ఆ కుర్రాడు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడని.. గూగుల్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి స్కూల్ కు వచ్చాడని తెలిపారు. నియామక పత్రం ఇదేనంటూ వాట్సాప్ లో తనకు ఓ పోస్ట్‌ను పెట్టాడని ఆమె చెప్పారు. అయితే అనుకోకుండా ఫోన్ నుంచి శర్మ పెట్టిన సందేశం డిలీట్ అయిందని ఆమె చెప్పారు. ఆ లెటర్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఆ లెటర్ చేతికి రాగానే పూర్తి వివరాలు చెబుతానని ఇంద్రా బెనివాల్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  chandigarh  icon designing  usa  harshit sharma  graphic designing  Indra beniwal  high package  

Other Articles