SC agrees to hear plea against Nitish సుప్రీంకోర్టులో నితీష్ కుమార్ కు షాక్..!

Sc agrees to hear plea to cancel nitish kumar s legislative council membership

Justice Dipak Misra, JusticeAmitava Roy, JusticeA M Khanwilkar, M L Sharma, MLC membership

The Supreme Court today agreed to hear a plea seeking cancellation of Bihar Chief Minister Nitish Kumar's membership of the state Legislative Council for allegedly concealing a pending criminal case against him. Read more at: http://economictimes.indiatimes.com/articleshow/59859896.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

సుప్రీంకోర్టులో నితీష్ కుమార్ కు షాక్..!

Posted: 08/01/2017 09:16 PM IST
Sc agrees to hear plea to cancel nitish kumar s legislative council membership

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నితీష్ కుమార్ తనపై ఉన్న క్రిమినల్ కేసును ఎన్నికల అఫిడెవిడ్ లో పోందుపర్చకుండా దాచిపెట్టినందుకు ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ ఈ పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై తక్షణ విచారణ జరపాలంటూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవ రాయ్, ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

పిటిషన్ విచారణ తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. 1991లో బర్హ్ నియోజవర్గంలో లోక్ సభ ఎన్నికలకు ముందు స్థానిక కాంగ్రెస్ నేత సీతారాం సింగ్ హత్య, పలువురు గాయపడిన సంఘటనలో నితీష్ కుమార్ ప్రమేయం ఉందని పిటిషనర్ తన పిటిషన్ లో ఆరోపించారు. నితీష్ పై ఎఫ్ఐఆర్ర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. నితీష్ పై క్రిమినల్ కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసినప్పటికీ రెస్పాండెంట్ నెంబర్ 2 (ఎన్నికల సంఘం) ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయలేదని అక్షేపించారు.

నితీష్ ఇప్పటికీ రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నారని న్యాయవాది శర్మ తన అఫిడెవిట్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ అఫిడెవిట్లలో తమపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా తెలియజేయాలంటూ 2002లో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నితీష్ బీహార్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 2004 నుంచి 2012 వరకూ తన అఫిడవిట్లలో నితీష్ తనపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసును బయటపెట్టలేదని పిటిషనర్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SC  Nitish Kumarm supreme court  M L Sharma  MLC membership  

Other Articles