election commission shock ruling party in Andhra pradesh అధికార పార్టీకి కేంద్ర ఎన్నిక కమీషన్ షాక్..!

Election commission shock ruling party in andhra pradesh

andhra pradesh, ruling party, Telugu desam party, chandra babu, nandhyal, by polls, Election commission, TDP, YSRCP, politics

Central Election commission gives shock to ruling party in Andhra pradesh by stating that 2017 januvary electoral list is only taken into consideration in nandyal by polls,

ఉప ఎన్నిక బరిలోని అభ్యర్థులకు కేంద్ర ఎన్నిక కమీషన్ షాక్..!

Posted: 07/28/2017 03:51 PM IST
Election commission shock ruling party in andhra pradesh

ఆంద్రప్రదదేశ్ రాష్ట్రంలోని అధికార పక్ష తెలుగుదేశం పార్టీతో పాటుగా పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఫోటీ బరిలో నిలవనున్న అభ్యర్థులందరికీ ఈ షాక్ తగలనుంది. అయితే నంద్యాల ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పార్టీలకు జలక్ తగిలింది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఎలాగైన గెలిచి తమ సత్తాను చాటాలని భావిస్తున్న అధికార పార్టీకి, ప్రజల్లో తమ ప్రభుత్వ పథకాలపై ఎక్కడా వ్యతిరేకత లేదని చాటుకునేకు ప్రయత్నంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.

జనవరి 1, 2017 వరకూ ఓటర్ల జాబితాలో ఉన్నవారికే ఓటు హక్కు కల్పిస్తూ ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో అంటే జనవరి తరువాత నమోదైన ఓటర్లను ఎన్నికలలో పాల్గోననీయకుండా చర్యలను తీసుకుంది. వీరిని పరిగణలోకి తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవేల దాదాపు 15వేల మందిని కొత్తగా ఓటర్లగా పార్టీలు నమోదు చేయించాయి. దీంతో పార్టీల కుట్రలను ముందగానే పసిగట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వారి వ్యూహాలకు తమ నిర్ణయంతో చెక్ పెట్టింది.

నంద్యాలలో ఈ ఏడాది జనవరి 1 వరకూ సుమారు 2లక్షల 9వేలమంది ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత చేరిన వారి సంఖ్య ఎన్నికల సంఘాన్ని కొంత విస్మయానికి గురిచేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. అయితే నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చి ఉపఎన్నికలలో లబ్ధిపొందాలని చూసిన వారికి చెక్ పడినట్లు అయ్యింది. దీంతో వచ్చే నెల 23న నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో మరో వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉపఎన్నిక బరిలో అనేక మంది బరిలో నిలుస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles