Rain halts galle test, teamIndia bowled out lanka for 291 లంకేయులను చిత్తు చేసిన టీమిండియా బౌలర్లు..

Rain halts galle test teamindia bowlers bowled out sri lanka for 291

Angelo Mathews, Cheteshwar Pujara, Hardik Pandya, India vs Sri Lanka 2017, India vs Sri Lanka Test series, mohammed shami, sri lanka vs india, virat kohli, Ind vs SL, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

Well the players are walking off. It is pouring heavily and the pitch is being covered. Meanwhile, India now lead by 365 runs.

గాలె టెస్టుకు వరుణుడి అడ్డంకీ.. స్వల్పస్కోరుకే లంక చిత్తు

Posted: 07/28/2017 02:20 PM IST
Rain halts galle test teamindia bowlers bowled out sri lanka for 291

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. అదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. చత్తీశ్వర్ పూజారా ఔట్ అయిన వెంటనే వర్షం కురవడంతో మ్యాచు నిలిచిపోయింది. అయితే ధాటిగా అడి భారత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాలన్న తొందరలో తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ధీరువన్ పెరీరా విసిరన బంతిని ఫాట్ కోట్టబోయి డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అప్పటి నుంచి అచితూచి అడుతున్న ఓపెనర్ అభినవ్ ముకుంద్, ఛత్తీశ్వర్ పూజారాలు.. నిలకడగా అడుతూ స్కోరుబోర్డును నెమ్మెదిగానే కదిలించారు. కాగా లహిరు కుమార విసిరన బంతిని ప్లిక్ చేసే క్రమంలో అది కాస్తా కుసల్ మెండిస్ క్యాచ్ పట్టడంతో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరకున్నాడు. అ తరువాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి వెళ్తున్న క్రమంలో వరుణుడు మ్యాచ్ ను అడ్డుకున్నాడు. అయితే తొలిఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు కూడా విజృంభించారు.

తమదైన పదునైన బంతులను విసురుతూ.. అతిథ్యజట్టుకు కట్టడి చేశారు. ఫలితంగా లంకేయులను 291 స్కోరుకు అటౌట్ చేశారు. అనుకున్నట్లే టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ అడించే అవకాశమున్నప్పటికీ.. బౌలర్లకు విశ్రాంతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో పాటు మ్యాచ్ పై పట్టుబిగించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను అడేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో లంకపై సాధించిన 309 పరుగుల అదిపత్యానికి మరికొన్ని పరుగులు జోడించిన తరువాత టీమిండియా డిక్లేర్ చేసే అవకాశాలు వున్నాయి.

మరో రెండు వందల పరుగులు చేసిన తరువాత కెప్టెన్ విరాట్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తుంది. కాగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో పెరీరా ఒంటరిపోరు చేశాడు. అయితే ఆయనకు మద్దతుగా ఒక్కరిద్దరు దాటిగా బ్యాటింగ్ చేసినా ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. పెరీరా మాత్రం 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజాకు 3, షమీకి 2, యాదవ్, అశ్విన్, పాండ్యాలకు తలో వికెట్ లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelo Mathews  Ravindra jadeja  hardik pandya  mohammed shami  virat kohli  Ind vs SL  cricket  

Other Articles